April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

నీరుకుళ్ళ వాసికి సివిల్స్ లో 255 ర్యాంకు


(జై భారత్ వాయిస్ ఆత్మకూరు),
హన్మకొండ జిల్లా ఆత్మకూరు మండలం నీరుకుళ్ళ గ్రామానికి చెందిన పోతరాజు హరిప్రసాద్ సివిల్స్ లో ఆల్ ఇండియా లో 255 ర్యాంకు సాధించారు 255 ర్యాంకు సాధించడం ఆత్మకూరు మండలంలోని మొదటి వ్యక్తిగా పేర్కొ నవచ్చు .హరి ప్రసాద్ ముంబై ఐఐటీలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చదివారు ఆ తర్వాత జపాన్ లోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తు ఆ తర్వాత సివిల్స్ కు ప్రిపేర్ అయ్యారు అని అతని తండ్రి నల్లబెల్లి మండలం నందిగామ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయుడు పోతరాజు కిషన్ తెలిపారు. ఆ తర్వాత సివిల్స్ లో 255 ర్యాంక్ సాధించారని చెప్పారు. కఠోర పరిశ్రమ తోనే సివిల్స్ సాధ్యం అని అన్నారు. సివిల్స్ లో ర్యాంక్ సాధించడం తో పోతరాజు కిషన్ కుటుంబాలలో ఆనందోత్సాహాలు జరుపుకున్నారు. హరి ప్రసాద్ అన్న శివ ప్రసాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా హైద్రాబాద్ లో పనిచేస్తున్నారు. తల్లి విజయ గృహిణి. ఎంతో ప్రణాళిక బద్దంగా చదివానని అందు వల్లనే సాధ్యం అయిందని హరిప్రసాద్ చెప్పార

Related posts

అగ్రంపహాడ్ సమ్మక్క జాతరకు నిధులు మంజూరు

Jaibharath News

కటాక్షపురంలో ప్రజా పాలన పై గ్రామ సభ

Jaibharath News

ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.