Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల శాంతి ర్యాలీ

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ ) గ్రేటర్ వరంగల్ నగరంలోని హనుమకొండ సుబేదారి శ్రీ వెంకటేశ్వర కాలనీ వాసుల ఆధ్వర్యంలో పహల్గాం ఉగ్రవాదుల చర్యలకు వ్యతిరేకంగా పర్యాటకులకు నివాళులర్పిస్తూ కోవత్తులతో శాంతి ర్యాలీని నిర్వహించారు కాలనీ నుండి ఫారెస్ట్ ఆఫీసు గుండా ర్యాలీ నిర్వహించి వడ్డేపల్లి జంక్షన్ లో మానవహారం చేపట్టి ఉగ్రవాదులకు, పాకిస్తాన్ కి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేపట్టారు .ర్యాలీ అనంతరం కాలనీ టీ జంక్షన్లో ఈ ఘటనలో అసువులు బాసిన అమాయక పర్యాటకులకు ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సందర్భంగా కాలనీ పెద్దలు మాట్లాడుతూ ఉగ్రవాద చర్యలను ఖండిస్తూ అమాయకుల ప్రాణాలను బలిగొన్న ఉగ్రవాదాన్ని అంతం అందించాలని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ లాంటి దేశాలకు తగిన బుద్ధి చెప్పాలని భారతీయులంతా ఐకమత్యంగా ఉండి ఇలాంటి చర్యలని ఖండించాలని పేర్కొన్నారు .ఈ కార్యక్రమంలో డాక్టర్ రవికుమార్, డాక్టర్ ప్రవీణ్ కుమార్, గంభీర్ రెడ్డి, ధర్మానాయక్ ,సమ్మిరెడ్డి ,అనిల్, శ్యామ్, రవీందర్, మరియు కాలనీ మహిళలు, పిల్లలు, వృద్దులు రుద్రమదేవి హాస్టల్ విద్యార్థినులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Related posts

లిచ్ పిట్ విధానం తో జల కాలుష్యాన్ని నివారించాలి.

గ్రామాల అభివృద్దే ప్రభుత్వ లక్ష్యం!-సెంట్రల్ లైటింగ్ ప్రారంభించిన ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి

రసూల్ పల్లి గ్రామంలో బతుకమ్మ చీరలు పంపిణీ

Jaibharath News