(జై భారత్ వాయిస్ ఆత్మకూరు):ఆత్మకూరు మండల కేంద్రంలోని జి ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో ప్రజాపాలన ప్రగతి బాట భూభారతి చట్టం, భూ పోర్టల్ పై నిర్వహించిన అవగాహన సదస్సులో జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సదస్సుకు హాజరైన రైతులకు భూ భారతి చట్టం-విది విధానాలను అధికారులు వివరించారు.రైతులు, ప్రజలు లేవనెత్తే సందేహాలకు వారికి అర్ధమయ్యేలా అధికారులు సమాధానం ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ…..గత కొన్నేళ్లుగా రైతులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటున్నారని,ధరణి అనేది రైతుల పాలిట శాపంలా దాపురించిందన్నారు.ధరణి వచ్చిన తర్వాత ఏదైనా పొరపాటును సవరించడానికి కూడా ఏ స్థాయిలోనూ స్పష్టత లేకపోవడంతో పాటు అధికారాలు లేవన్నారు. రైతులకు సంపూర్ణమైన హక్కును కల్పించే విధంగా కొత్త చట్టం ద్వారా కృషి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు భూభారతి చట్టాన్ని తీసుకువచ్చారన్నారు.కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల భూ సమస్యలను పరిష్కరిస్తుందని,రైతులు తమ సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే పరిష్కరిస్తామన్నారు.రాష్ట్రంలో భూ సమస్యలను పరిష్కరించేందుకు చట్ట బద్ధమైన భూభారతి చట్టాన్ని తీసుకువచ్చిందన్నారు. గతంలో భూమీ సమగ్ర సర్వేను తీసుకువచ్చి పూర్తి చేయలేకపోయారని దీంతో రైతుల సమస్యలు అలాగే ఉండిపోయాయని అన్నారు.ఏ చట్టం చేసిన ప్రజల అభివృద్ధి సంక్షేమం ఆధారంగా ఉండాలని,ఈ నెల 30వ తేదీ నాటికి పైలట్ ప్రాజెక్టు కింద చేపట్టిన నాలుగు మండలాల్లో పూర్తి చేసి,తర్వాత మే 1 నుండి 15వ తేదీ వరకు ప్రతి జిల్లాలో ఒక మండలానికి భూభారతి చట్టంపై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయన్నారు. జూన్ 2వ తేదీ నుండి గ్రామాలలో సమగ్ర సర్వే నిర్వహించి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించనున్నట్లు. హనుమకొండ జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద నడికూడ మండలాన్ని ఎంపిక చేస్తామన్నారు.ఆర్డీవో స్థాయిలోనే 90 శాతం వరకు భూ సమస్యల అసలు పరిష్కారం అవుతాయి అన్నారు.. గ్రామాలలో సర్వే పూర్తి అయిన తర్వాత సంబంధిత రైతుల వివరాలతో కూడిన(ఫ్లెక్సీల) రూపంలో ప్రదర్శించనున్నట్లు చెప్పారు.భూ సమస్యల పరిష్కారం కోసం తీసుకువచ్చిన భూభారతి చట్టంపై రైతులు,ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు.

previous post