(జై భారత్ వాయిస్ న్యూస్) హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఆదివారం నాడు జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభా ప్రాంగణం జనసంద్రంగా మారింది. ఇసుకేస్తే రాలనంతగా జనసమూహం తరలివచ్చారు. చీమల దండులా తలపించిన బీఆర్ఎస్ రజతోత్సవ సభా ప్రాంగణం.
తెలంగాణ అన్ని జిల్లాల నుండి టిఆర్ఎస్ కార్యకర్తలు నాయకులు ప్రజలు భారీ ఎత్తున సభకు హాజరయ్యారు ఈ సభలో ఆపార్టీ అధినేత కేసీఆర్ మాట్లాడుతూ *నా కళ్లముందే తెలంగాణ ఆగమైతుంటే.నాకు దుఃఖం కలిగిస్తోందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు గోల్‌మాల్ చేయడంలో, అబద్ధాలు చెప్పడంలో కాంగ్రెస్ పార్టీని మించిన పార్టీ లేదు. ఇక్కడ ఉన్నోళ్ళు చాలరని, ఢిల్లీ నుండి డూప్లికేట్ గాంధీలు కూడా వచ్చి స్టేజీల మీద చప్పట్లు కొట్టి, డాన్సులు వేసి మరీ లేనిపోని హామీలు ఇచ్చారు. అన్యాయాన్ని, అక్రమాలపై ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్స్ పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసులకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హెచ్చరించారు.*కమీషన్లు తీసుకొనుడు సంచులు నింపుడు సంచులు మోసుడు
ఇదే ఏడాదిన్నర కాంగ్రెస్ పాలన. అని అన్నారు

previous post
next post