Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రైతులకు సేవలు అందించేందుకు ప్రభుత్వం కృషి– పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు): ప్రభుత్వం సన్న కారు చిన్న కారు రైతులకు సహకార సంఘాల ద్వారా సేవలు అందించేందుకు కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు.గురువారం పిఎసిఎస్ పెంచికలపేట ఆధ్వర్యంలో నీరుకుల్ల గ్రామంలో రూ .90 లక్షల నిధులతో నిర్మించనున్న గోదాములకు శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి భూమి పూజ, శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూకాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దఎత్తున సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, సహకార సంఘాల ద్వారా రైతులకు మరిన్ని సేవలు అందించేందుకు కృషి చేస్తుందని అన్నారు. సన్న రకం ధాన్యానికి రాష్ట్ర ప్రభుత్వం బోనస్‌ ఇస్తుండడంతో యాసంగి సీజన్‌లో కూడా సన్నరకం వరి సాగు పెరిగింది అని అన్నారు. రైతులకు వ్యవసాయమే ప్రధాన జీవనాధారమని, ఇలాంటి కీలకమైన రంగానికి సేవలందించడంలో పీఏసీఎస్‌లదే ముఖ్య పాత్ర అని అన్నారు. రైతులు ఆర్థికంగా చితికిపోకుండా సహకార సంఘాలు ఎంతో తోడ్పాటును అందిస్తున్నాయని అన్నారు. , కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సహకార సంఘాలను చైతన్యపరిచి అనేక రకాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. రైతులు పిఎసిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్న గోదాంలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.ఈ కార్యక్రమంలో పెంచికలపేట సహకార సంఘం చైర్మన్ కంది శ్రీనివాస్ రెడ్డి ,వైస్ చైర్మన్ పోతరాజు రాజు ,ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ప్రెసిడెంట్ ఉడుత రాజేందర్ ,మండల కాంగ్రెస్ అధ్యక్షులు కమలాపురం రమేష్ ,సొసైటీ డైరెక్టర్లు పిట్టల సూరయ్య ,జిల్ల పెళ్లి సుధాకర్ ,అహల్య, గ్రామ మాజీ సర్పంచ్ ఉడత మహేందర్ ,మాజీ ఉపసర్పంచ్ మానగాని సాంబమూర్తి ,నీరుకుల్లా గ్రామ పార్టీ అధ్యక్షుడు కిన్నెర ప్రేమ్చంద్ ,మండల కాంగ్రెస్ నాయకులు పొనుగోటి సత్యనారాయణ మారత రజనీకర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరము పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి ని ఆత్మకూరు సోషల్ మీడియా చైర్మన్, సొసైటీ డైరెక్టర్ ఉడుత రాజేందర్, సొసైటీ వైస్ చైర్మన్ పోతరాజు రాజు లు పలువురు సన్మానించారు.

Related posts

సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్

శాయంపేట కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయజెండా ఆవిష్కరణ*

జనం నుండి వనం కేగిన అమ్మవార్లు ” -జాతర మహాగట్టం ముగిసింది.

Jaibharath News