Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఆర్ట్స్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి!

(జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ )హనుమకొండ సుబేదారిలోని కాకతీయ విశ్వవిద్యాలయం ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో 16 సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల బోధ నేతర సిబ్బంది ఆధ్వర్యంలో కాకతీయ విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య కర్నాటి ప్రతాపరెడ్డికి వినతిపత్రం ఇచ్చినారు. ఇందులో ప్రధానంగా గత ఆరేడు నెలలుగా కళాశాలకు సహాయక రిజిస్టర్ లేరని, కళాశాల 100 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కళాశాలలో అందంగా తీర్చిదిద్దడం కోసం కావలసిన నిధులను సమకూర్చాలని, అదేవిధంగా పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని బోధ నేతల సిబ్బంది సంఘం అధ్యక్షులు బుక్య రాజు ఆధ్వర్యంలో వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా రాజు మాట్లాడుతూ వైస్ ఛాన్స్లర్ కళాశాలలోని సమస్యలను పరిష్కరించుటకు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.

Related posts

కేసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Jaibharath News

పోచమ్మ తల్లిబోనాల ఉత్సవాలలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్ చైర్మన్ రాఘవ రెడ్డి

5వేల కోట్ల నిధులతో రెడ్డి కార్పొరేషన్ ను ఏర్పాటు చేయాలి