Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలి

(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)
గీసుకొండ మండలం అనంతరం గ్రామంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్ ఆధ్వర్యంలో రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే  కార్యక్రమం  నిర్వహించారు ఈ కార్యక్రమంలో పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి వరంగల్  ఏ.డి.ఆర్, డాక్టర్ కుమార్ రెడ్డి  హాజరై రైతులకు  పంటల మీద అవగాహన కల్పించారు.ముఖ్య అతిథిగా హాజరైన పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాష్ రెడ్డి  మాట్లాడుతూ శాస్త్రవేత్తలు రైతులకు చేరువై ఈ విధంగా కార్యక్రమం నిర్వహించడం సంతోషంగా ఉందని రైతులందరూ సేంద్రియ వ్యవసాయం వైపు వెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వం ముందుకు తీసుకువచ్చే న్యాచురల్ ఫార్మింగ్ పథకంలో భాగస్వాములై పెద్ద ఎత్తున ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలని అందుకు తన వంతు కృషి ఎప్పుడు ఉంటుందని చెప్పడం జరిగింది. ఏ.డి.ఆర్, డాక్టర్ కుమార్ రెడ్డి  మాట్లాడుతూ తక్కువ యూరియా వాడి – సాగు ఖర్చును తగ్గించుకోవడం, అవసరం మేరకకు రసాయనాలను వాడి – నేల తల్లిని ఆరోగ్యంగా కాపాడుకోవాలని రైతులకు సూచించారు. రైతులు కొనుగోలు చేసిన ఎరువులు పురుగుమందుల రషీదులను భద్రపరచుకొని -కష్టకాలంలో నష్టపరిహారం పొందాలి. సాగు నీటిని అదా చెసి -భావితరాలకు అందించాలి. చెట్టును పెంచి – పర్యావరణాన్ని కాపాడుకోవాలని అన్నారు ఈ కార్యక్రమం లో తెగుళ్ల విభాగం శాస్త్రవేత్త డా. అశ్విని, వ్యవసాయ అధికారి పి.హరి ప్రసాద్ బాబు, తహశీల్దార్  రియాజుద్దీన్, ఎఇఓ కావ్య, పంచాయతీ కార్యదర్శి చిత్తరన్జన్ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ,రైతులు పాల్గొన్నారు.

Related posts

సీతారాం ఏచూరి మరణం కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటు

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి

రైతులు పండించిన పంటపై మెళకువలు పాటిస్తే ఉత్పత్తులకు మార్కెట్లో మంచి ధర