Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఉద్యమ కారులను ఆదుకోవాలి.

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు ఆత్మకూరు మండల ఉద్యమకారుల ఫోరం మండల అధ్యక్షుడు ఎండి బాబు మియా (చిరు) అధ్యక్షతన ప్రెస్ మీట్ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కార్యదర్శి ఇర్సడ్ల సదానందం మాట్లాడుతూ గత 2023 సంవత్సరం శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షులు ప్రస్తుత ముఖ్యమంత్రి కాంగ్రెస్ మేనిఫెస్టోలో తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం పింఛన్ ఇతర సౌకర్యాలు కల్పిస్తామని ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు.18 నెలలు అయిన ఉద్యమకారుల గురించి క్యాబినెట్ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విడ్డూరం తెలంగాణ రాష్ట్రం కోసం ఎంతోమంది ప్రాణ త్యాగాలు ఆర్థిక ఇబ్బందులను సైతం లెక్కచేయకుండా తెలంగాణ రాష్ట్రమే ధ్యేయంగా పని చేసిన వారికి ఆర్థిక చేయూతనివ్వాలని కోరుచున్నామని తెలిపారు.లేనిచో విడతలవారీగా ఉద్యమాలు చేస్తామని హెచ్చరిస్తున్నామని అన్నారు. పార్టీలలో తెలంగాణ కోసం పోరాడిన వారు ఉన్నారని చెప్పారు. ఇప్పటికైనా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి తెలంగాణ ఉద్యమకారుల డిమాండ్స్ నెరవేర్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు ఎండి బాబు మియా మండల ప్రధాన కార్యదర్శి దొంక దువ్వ రాజయ్య ఆత్మకూరు మాజీ సర్పంచ్ నాగేల్లి సామెల్ తెలంగాణ ఉద్యమకారులు రేవూరి జనార్దన్ రెడ్డి జిల్లెల్ల రాజు తోట గణపతిపెరుమళ్ళ స్వామి వడ్డేపల్లి నరసయ్య పులి చేరు పైడి తదితరులు పాల్గొన్నారు

Related posts

రాజకీయ పార్టీల నాయకులు సమన్వయం పాటించాలి

Jaibharath News

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News

అగ్రంపహాడ్ లో గద్దెనెక్కిన సమ్మక్క తల్లి -ఉవ్వెత్తున ఎగిసిపడిన భక్త జన సందోహం

Jaibharath News