Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

స్థానిక సంస్థలలో బిసీలకు 42 శాతం రిజర్వేషన్  అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ న్యూస్: భాగ్యనగరం)
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ సంబరాలలో భాగంగా సమాజంలో వివిధ రంగాల్లో సేవలు అందించిన వారిని సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని రవీంద్ర భారతి సమావేశ మందిరం లో ఉత్తమ అవార్డులు జూన్ 28న ప్రధానం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగామాజీ పార్లమెంట్ సభ్యులు హన్మంత్ రావు,బి.సీ కమిషన్ చైర్మన్ బి. ఎస్ రాములు, బి.సీ.ఎఫ్ రాష్ట్ర అధ్యక్షలు చెన్న రాములు, టి.ఆర్.టి.యు వ్యవస్థాపకులు కూరోజు దేవేందర్, సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ అధ్యక్షులు మీనగ గోపి బోయ, ఉపాధ్యక్షులు రజనీ దాసరి, సీఈఓ పరమేశ్వరి తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా హాజరైన వక్తలు  మాజీ యం.పి.హన్మంత్ రావు, బి. ఎస్ రాములు ప్రసంగిస్తూ గ్రామ, మండల, జిల్లాపరిషద్, మున్సిపల్ మరియు కార్పొరేషన్ ఎన్నికలలో బి సీ లకు 42% రిజర్వేషన్స్ కలిపించాలని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

.ప్రజా పాలనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాత్ర ఆపరేషన్ సింధూర్ అంశాలపై కవి సమ్మేళనం నిర్వహించారు.తెలంగాణ ఉద్యమంలో రాష్ట్ర వ్యాప్తంగా చురుకుగా పాల్గొన్న 22 మంది ఉద్యమ కారులను శాల్వ, మెమోంటో మరియు బొకేలతో ఘనంగా తెలంగాణ తల్లి ఐకాన్ అవార్డు -2025 లను ప్రధానం చేశారు ఈ అవార్డును అందుకున్నావారిలో బి.ఎస్. రాములు, కోల జనార్దన్,చెన్న రాములు, కూరోజు దేవేందర్ ,సుబ్బలక్ష్మి, దర్శనం దేవేందర్ ,టి.వి.అశోక్, ఎన్. నాగమ్మ, వైసాయన్న, ఎం.ఏ లతీఫ్, ఏలూరి శ్రీనివాస రావు,రాజారామ్ ప్రకాష్ లు అవార్డు లు అందుకున్నారు.ఈకవి సమ్మేళనంలో విజయలక్ష్మి, ప్రమీలదేవి,సాజిదా సికిందర్, జ్యోతిర్మయి,సరోజ, డాక్టర్ . సత్యవతి సావిత్రిబాయి పూలే ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు

Related posts

బిజెపి అంటే కొత్త అర్థం చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

బిఆర్ ఎస్ నుంచి కాంగ్రెస్ లోకి ఆరుగురు ఎమ్మెల్సీలు

Sambasivarao

కేటీఆర్ బీఆర్ఎస్ బిసి నేతలతోసమావేశం