Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం

TG ఇంజినీరింగ్ (MPC స్ట్రీమ్) ప్రవేశాల కౌన్సిలింగ్ ప్రారంభం
  (జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)రాష్ట్ర సాంకేతిక విద్యాశాఖ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, TG EAPCET–2025 (MPC స్ట్రీమ్) అడ్మిషన్ కౌన్సిలింగ్  మంగళవారం జూలై 1, 2025 న రాష్ట్రవ్యాప్తంగా హెల్ప్ లైన్ సెంటర్లలో ఒకేసారి విజయవంతంగా ప్రారంభమైందని.
వరంగల్. ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రిన్సిపాల్ డాక్టర్. బైరిప్రభాకర్ తెలిపారు .ఇంజినీరింగ్  కోర్సులలో ప్రవేశాల కోసం ప్రభుత్వ  ప్రైవేట్ ఇంజినీరింగ్ కళాశాలలలో ఈ కౌన్సిలింగ్ ద్వారా ప్రవేశం పొందవచ్చునని అన్నారుTG EAPCET హెల్ప్ లైన్ సెంటర్‌గా గుర్తింపు పొందిన ప్రభుత్వ పాలిటెక్నిక్, వరంగల్ కేంద్రంలో మొదటి రోజు ప్రక్రియ విజయవంతంగా ప్రారంభమైంది. ఉదయం నుండే అభ్యర్థులు భారీ సంఖ్యలో హాజరై, మొత్తం 480 మంది అభ్యర్థులు మొదటి రోజు నమోదు చేసుకున్నారు. ఉదయం  ప్రారంభమైన సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ క్రమబద్ధంగా, సజావుగా కొనసాగుతోంది.

కౌన్సిలింగ్ ముఖ్యమైన తేదీలు:

*ప్రథమ దశ*

ఆన్‌లైన్ సమాచారం నమోదు, ఫీజు చెల్లింపు & స్లాట్ బుకింగ్: 28-06-2025 నుండి 07-07-2025

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 01-07-2025 నుండి 08-07-2025

ఆప్షన్ల ఎంపిక: 06-07-2025 నుండి 10-07-2025

ఆప్షన్ల ఫ్రీజింగ్ (తదుపరి మార్పులుకు ముగింపు): 10-07-2025

మాక్ సీటు కేటాయింపు: 13-07-2025 లోపు

ఆప్షన్ల మార్పు (ఆఖరి తుదిసారి): 14-07-2025 నుండి 15-07-2025

తాత్కాలిక సీటు కేటాయింపు: 18-07-2025 లోపు

ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్: 18-07-2025 నుండి 22-07-2025

*రెండవ దశ*

స్లాట్ బుకింగ్ & ఫీజు చెల్లింపు (మొదటి దశలో పాల్గొననివారికి ): 25-07-2025

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 26-07-2025

ఆప్షన్ల ఎంపిక: 26-07-2025 నుండి 27-07-2025

తాత్కాలిక సీటు కేటాయింపు: 30-07-2025 లోపు

ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్: 30-07-2025 నుండి 01-08-2025

కాలేజీకి భౌతికంగా హాజరు కావాలి: 31-07-2025 నుండి 02-08-2025

*చివరి దశ (ఫైనల్ ఫేజ్)*

స్లాట్ బుకింగ్ & ఫీజు చెల్లింపు: 05-08-2025

సర్టిఫికెట్ వెరిఫికేషన్: 06-08-2025

ఆప్షన్ల ఎంపిక: 06-08-2025 నుండి 07-08-2025

తాత్కాలిక సీటు కేటాయింపు: 10-08-2025 లోపు

ఫీజు చెల్లింపు & సెల్ఫ్ రిపోర్టింగ్: 10-08-2025 నుండి 12-08-2025

కాలేజీకి హాజరు (బ్రాంచ్/కాలేజీ మార్పు ఉన్నవారికి): 11-08-2025 నుండి 13-08-2025

*ఇంటర్నల్ స్లైడింగ్*

స్లైడింగ్ కోసం ఆప్షన్ల ఎంపిక: 18-08-2025 నుండి 19-08-2025

తాత్కాలిక కేటాయింపు: 22-08-2025 లోపు

బ్రాంచ్ మారినవారు సెల్ఫ్ రిపోర్ట్ & ప్రింట్ తీసుకోవాలి: 22-08-2025 నుండి 23-08-2025

*స్పాట్ అడ్మిషన్లు*

వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో: 23-08-2025 లోపు అందుబాటులో ఉంటాయి.ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ డా. బైరిప్రభాకర్ TG EAPCET (MPC స్ట్రీమ్) కౌన్సిలింగ్‌లో పాల్గొన్న అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు సమయపాలనతో, అవసరమైన ధృవపత్రాలతో ముందుగా హాజరై తమ లక్ష్యాలను సాధించాలన్నారు.మరింత సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్:
👉 https://tgeapcet.nic.in
  ఈ ప్రక్రియలో సిస్టమ్ అడ్మిన్ గా . రవీందర్ వ్యవహరించగా, . శ్రీనాథ్, . యెల్ల స్వామి chief verification officers గా వ్యవహరించారు . కళాశాల ఇతర సిబ్బంది verification officers గా, briefing officers  ఇతర విధులు నిర్వర్తిస్తున్నారని.వరంగల్. ప్రభుత్వ పాలిటెక్నిక్, ప్రిన్సిపాల్ డాక్టర్. బైరిప్రభాకర్  తెలిపారు

Related posts

గీసుకొండలోఅటల్ బిహారీవాజ్ పాయ్ జయంతి వేడుకలు

బిజెపి వరంగల్ జిల్లా కార్యధర్శిగా మొలుగూరి శ్రీనివాస్ నియామకం

Sambasivarao

పరిశుభ్రతతోనే వ్యాధులు దూరం…డిఎం&హెచ్ఓ డాక్టర్ వెంకటరమణ