Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

తెలంగాణలో యూరియా కొరత కేంద్ర ప్రభుత్వ వివక్షమే రైతులకు సరిపడా ఎరువులను అందించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
కేంద్ర ప్రభుత్వం నుంచి యూరియా మన రాష్ట్రానికి రావలసిన యూరియా ఏప్రిల్ మే. జూన్. నెలలకు గాను కేంద్రం 5 లక్షల టన్నుల యూరియా కేటాయించగా అందులో కేవలం 3 లక్షల టన్నులు మాత్రమే ఇవ్వగా తెలంగాణ రాష్ట్రంలో రైతులకు యూరియా కొరత ఏర్పడిందని జిల్లా కాంగ్రెస్ నాయకుడు బీసీ నేత. సాయిలి.ప్రభాకర్ అన్నారు

యూరియా ఎరువులు కేంద్ర ప్రభుత్వ పరిధిలో వి కాబట్టి ఇప్పటికైనా బిజెపి కేంద్ర మంత్రులుగా ఉన్న బండి సంజయ్ కిషన్ రెడ్డి లు రాష్ట్రంలో బిజెపి ఎంపీలు కేంద్రంతో మాట్లాడి రాష్ట్రంపై వివక్ష వీడి రైతులకు సరిపడా యూరియా అందించాలని లేనిపక్షంలో ప్రజా రైతు అగ్రహానికి గురికవలసిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఎరువుల కొరత కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల ఏర్పడింది దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ప్రజలు ఎవరు నమ్మరనిదీనిపై ఇప్పటికే రాష్ట్ర సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి పలుసార్లు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్రంలో ఉండబడిన కేంద్ర మంత్రులు బండి. సంజయ్ కిషన్ రెడ్డి బిజెపి ఎంపీలకు పలుసార్లు రాతపూర్వకంగా విజ్ఞప్తి చేయడం జరిగిందని తెలిపారుబిజెపి ఎంపీ డీకే అరుణ కాంగ్రెస్ నిర్లక్ష్యంతోనే యూరియా కొరత ఏర్పడిందని అనడం సరైనది కాదని మీ ప్రభుత్వ తప్పిదాన్ని ఇతర పార్టీల మీద రుద్దడం సరైనది కాదన్నారు ఇప్పటికైనా రాష్ట్రంలో ఉండబడే కేంద్ర మంత్రులు బిజెపికి సంబంధించిన ఎంపీలు అందరూ కేంద్రంతో మాట్లాడి రైతులకు సరిపడా ఎరువులను అందించాలని ప్రభాకర్ డిమాండ్ చేశారు

Related posts

పదోన్నతిపై బదిలీ అయిన బ్యాంకు ఉద్యోగి రమేష్ కు ఘన సన్మానం

Jaibharath News

రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో సమావేశం

Sambasivarao

సత్ఫలితాలు ఇస్తున్న పాఠశాల కిచెన్ గార్డెన్స్

Sambasivarao