Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చు తెలంగాణ తొలి స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి

జై భారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం
బంధుమిత్రుల కలయికతో మానసిక ఒత్తిడి తగ్గించుకోవచ్చని తెలంగాణ తొలి స్పీకర్ శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హైదరాబాద్ నగరంలో శ్రీనివాస పద్మావతి కాలనీ లోనితన బంధువు కూరోజు శ్రీధర్  ఇంటిని ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి సందర్శించారు.మధుసూదనాచారి  అత్యంత సన్నిహిత బంధువులు కూరోజు  దేవేందర్ రిటైర్డ్ హెడ్ మాస్టర్ ,కూరోజు విజయలక్ష్మి  కూరోజు శ్రీధర్-గీత, శ్రీకాంత్ -భాగ్య రేఖ, కూరోజు శ్రేయాన్స్,  బొల్లోజు శ్రీదేవి,బొల్లోజు వేణుగోపాల్  ఆకోజు మహేష్-సుబ్బలక్ష్మి,, శ్రీజని, శ్రీవల్లి తదితరులు  హిమాయత్ నగర్ మాజీ సర్పంచి రవి యాదవ్   బి.ఆర్.ఎస్ యూత్ అధ్యక్షులు కాళిదాసుచారి తదితరులు మాజీ స్పీకర్ కు ఘన స్వాగతం పలికారు.శ్రీనివాస పద్మావతి కాలనీ వాసులతో సంభాషించడం వారెంతో ఆనందానికి లోనయ్యారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ శాస్త్ర సాంకేతిక విజ్ఞానం అభివృద్ధి చెంది ఉమ్మడి కుటుంబం నుండి వృత్తి రీత్యా దూరంగా ఒంటరి జీవితాన్ని గడుపు వారిలో మానసిక ఒత్తిడికి గూరైతున్నారని  బంధుమిత్రులతో ఉండడం వల్ల మానసిక ఒత్తిడి తగ్గుతుందని అన్నారుపూర్వకాలమునాటి నిరక్షరాస్యులు నేటి అక్షరాస్యులు- అత్యధికంగా ఏర్పడిన విద్యాసంస్థలు  అనే అంశంపై   విద్య యొక్క ప్రాముఖ్యతను కాలనీ విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు హాజరైన కాలనీవాసులకు తెలియజేశారు.హిమాయత్ నగర్ మాజీ సర్పంచి రవి యాదవ్ , బి.ఆర్.ఎస్ యువజన అధ్యక్షులు కాళిదాసుచారి  హిమాయత్ నగర్ పెద్దలు శ్రీనివాస పద్మావతి కాలనీ అసోసియేషన్ అధ్యక్షులు జనార్ధన్, ఉపాధ్యక్షులు కూరోజు శ్రీధర్, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, కాలనీ వాసులు బంధుమిత్రులు మాజీ స్పీకర్ ను ఘనంగా సన్మానించారు

Related posts

అమెరికా పర్యటనకు వెళుతున్న  సామాజిక వేత్త  పెగళ్ళపాటి లక్ష్మీనారాయణ-గీతమ్మ దంపతులకు ఆత్మీయ వీడ్కోలు

ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి టిఎన్జీఓస్-రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్

ప్రభుత్వ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో అడ్మిషన్ కొరకు TG EAPCET – 2025 (MPC స్ట్రీమ్) రెండవ దశ కౌన్సిలింగ్ ప్రారంభం