హనుమకొండ జేఎన్ఎస్ స్టేడియాన్ని శుక్రవారం కలెక్టర్ స్నేహ శబరీష్ పరిశీలించారు. ఈ సందర్భంగా స్టేడియాన్ని ఆమె కలియతిరిగారు. జేఎన్ఎస్ స్టేడియంలోని వసతి సౌకర్యాలను కలెక్టర్ డివైఎస్ఓ అశోక్ కుమార్ ను అడిగి తెలుసుకున్నారు. మొదటగా అథ్లెటిక్ ట్రాక్ ను పరిశీలించారు. అనంతరం బాలబాలికల హాస్టల్ గదులను తనిఖీ చేశారు. అలాగే స్టేడియంలోని మేస్ హాస్టల్ ను, గ్యాలరీలను పరిశీలించారు. జేఎన్ఎస్ స్టేడియంలో క్రీడా వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు. అలాగే హనుమకొండ జేఎన్ఎస్ లో త్వరలో ఏర్పాటు చేసే తాత్కాలిక స్పోర్ట్స్ స్కూల్ సౌకర్యాలు ఏర్పాటుపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా యువజన క్రీడా అధికారి గుగులోతు అశోక్ కుమార్, ఇంజనీరింగ్ అధికారులు, కోచ్ లు, సిబ్బంది పాల్గొన్నారు
