జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
“స్పూర్తి” కార్యక్రమంలో భాగంగా వరంగల్ జిల్లా సంగెం మండలంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని (KGBV) వరంగల్ జిల్లా సివిల్ సప్లై అధికారి కిష్టయ్య సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు పోషకాహారం (న్యూట్రిషన్), ఆహార నాణ్యత మరియు ఆరోగ్య పరిరక్షణ అంశాలపై అవగాహన కలిగించారు.ఈ సందర్భంగా వంటగది (కిచెన్ రూమ్), పరిసరాల శుభ్రత, వంట ఏర్పాట్లు, సిబ్బంది విధినిర్వహణ మరియు విద్యార్థుల స్పందనలను సమగ్రంగా సమీక్షించారు. అన్ని ఏర్పాట్లు సక్రమంగా ఉండటాన్ని అభినందించిన అధికారి, విద్యాలయంలో అమలవుతున్న ఆరోగ్య భద్రతా చర్యలపై సంతృప్తి వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ కె. నీలిమ ఉపాధ్యాయినుల బృందం పాల్గొని విద్యార్థుల అభ్యున్నతికి కృషి చేయడం ప్రశంసనీయమని ఆయన పేర్కొన్నారు.
