July 29, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

హనుమాన్ చాలీసాపఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూంది

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్:హనుమాన్ చాలీసా పఠించడంతో  దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూందని హనుమాన్ గురుస్వాములు ఆకుతోట బాలకొమురెల్లి,పేరాల ప్రభాకర్ ,మాటేటి సత్యనారాయణ అన్నారు.వరంగల్ మహా నగరంలోని కరీమాబాద్, శ్రీ కాశీ విశ్వేశ్వర దేవస్థానం బొమ్మల గుడిలో  శ్రావణమాసం మొదటి శనివారం పర్వదినం పురస్కరించుకొని శ్రీ కాశీ విశ్వేశ్వరస్వామి దేవస్థానం ప్రధాన అర్చకులు కాపర్తి శంకర్ శర్మ , కాపర్తి శివ శర్మ  ఆధ్వర్యంలో బొమ్మలగుడి హనుమాన్ భక్త మండలి గురుస్వామి నాగపూర్ అశోక్ , పొగాకు సందీప్  ఆహ్వానం మేరకు గురుస్వాములు ఆకుతోట బాలకొమురెల్లి, పేరాల ప్రభాకర్ ,మాటేటి సత్యనారాయణ (సత్యం) వీరి శిష్య బృందం కొప్పుల రాజు, ఆకుతోట మోహన్ కృష్ణ  కొండబత్తిని రాఘవేంద్ర,కోల ఆశ్వత్  బస్వరాజు హరీష్ ,భక్తి శ్రద్ధలతో 11 వ వారం సంపూర్ణ హనుమాన్ చాలీసా 11సార్లు పారాయణము,రామనామ కీర్తనలతో,అంగ రంగా వైభవంగా భక్తిభావంతో భజనలతో, హనుమాన్ విగ్రహానికి వివిధ రకాల పుష్పాలతో అలంకరించి,పూజ చేసి స్వామి వారికి హారతి ఇవ్వడం జరిగింది. హనుమాన్ చాలీసా పారాయణము అనేది భక్తుల హృదయాన్ని గెలుచుకున్న శక్తివంతమైన స్తోత్రం దీన్ని పఠించడం వల్ల భయం తొలగి పోతుంది. ధైర్యం ఆత్మబలం పెరుగుతుంది దుష్ట శక్తుల నుంచి రక్షణ కల్పిస్తూ ఆరోగ్యానికి విజయానికి మార్గం చూపుతుంది. శ్రీ హనుమంతుడి కృపా పొందాలంటే హనుమాన్ చాలీసా భక్తితో నమ్మకంతో పఠించాలి. మనసుకు శాంతిని జీవితానికి శక్తిని ఇస్తుంది. ఈ హనుమాన్ చాలీసా పారాయణం కార్యక్రమంలో జై భారత్ వాయిస్ న్యూస్ రిపోర్టర్ సాంబశివరావు ,పుష్పాల సంజీవయ్య,బత్తుల రాజేందర్ ,భక్తులు స్థానికులు పాల్గొన్నారు.

Related posts

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

యువత మాదక ద్రవ్యాలకు వ్యసన పరులు  కావద్దు డాక్టర్ అర్చన

*సర్వాయి పాపన్న గౌడ్ జయంతి*

Sambasivarao