కరీంనగర్, జూలై 30:తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల ఇంటర్ కళాశాల, చింతకుంటలో 2025-26 విద్యాసంవత్సరానికి సంబంధించి స్పాట్ అడ్మిషన్లు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మి తెలిపారు. ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం సీఈసీ, వొకేషనల్ (ఏటి, ఐఎం) కోర్సుల్లో ప్రస్తుతం మొత్తం 63 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయని పేర్కొన్నారు. వీటి కోసం జూలై 31, గురువారం ఉదయం 9:00 గంటల నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు స్పాట్ అడ్మిషన్ దరఖాస్తులను స్వీకరిస్తామని తెలిపారు. అర్హత కలిగిన విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆమె సూచించారు.
