Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

పారిశుధ్య కార్మికులకు కనీస వేతనం అమలు చేయాలి

(జై భారత్ వాయిస్ ఆత్మకూరు)గ్రామపంచాయతీల లో పనిచేసే పారిశుధ్య సిబ్బందికి కనీస వేతనం రూ. 25వేల రూపాయలు కనీస వేతనం అమలు చేయాలని జిల్లా గ్రామ పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో ఆత్మకూరు గ్రామపంచాయతీ పారిశుద్ధ్య సిబ్బంది ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగను కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పాశుద్ధ సిబ్బంది కమిటీ నాయకులు మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పనిచేసే సిబ్బందికి కనీస వేతనము అందక అనేక ఇబ్బందులు పడుతున్నామని వారు మందకృష్ణ మాదిగకు ఆ వివరించారు. ఈ సందర్భంగా పద్మశ్రీ మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ గ్రామపంచాయతీలో పని చేసే పారిశుద్ధ్య సిబ్బందికి తగిన ఆరోగ్య భద్రత , కనీస వేతనము ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీనికోసం ఆందోళన చేపడతామని ఆయన అన్నారు.ఈ సందర్భంగా పారిశుద్ధ్య సిబ్బంది జిల్లా కమిటీ నాయకులు తనుగుల నరేష్, గణిపాక శ్రీను, తదితరులు పాల్గొన్నారు

Related posts

నీరుకుల్ల గ్రామంలో సంచరిస్తున్న పునుగు పిల్లులు

బేషరతుగా సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి, ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి

యోగా మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుంది! వైస్ ప్రిన్సిపాల్ ఆచార్య అనుమంతు!!