Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

శంకేశి రాజేష్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  


జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ  పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. వైద్య, ఆరోగ్య శాఖలోని  హన్మకొండ ప్రభుత్వ ప్రసూతి ఆసుపత్రిలో పనిచేస్తున్న శంకేసి రాజేష్ ఉత్తమ ప్రతిభా అవార్డును జిల్లా కలెక్టర్ , జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్.అప్పయ్య  చేతుల మీదుగా అందుకున్నారు. ఈ కార్యక్రమంలో  , ప్రోగ్రాం అధికారి డాక్టర్‌ మదన్‌మోహన్‌, వరంగల్‌ జిల్లా టీఎన్‌జీవోస్‌ అధ్యక్షుడు గజ్జల రామ్‌ కిషన్‌, కార్యదర్శి గజే వేణుగోపాల్‌, కోశాధికారి పాలకుర్తి సదానందం, రాష్ట్ర కార్యదర్శి వేముల వెంకటేశ్వర్లు, ఉపాధ్యక్షులు గద్దల రాజు, పోలుసాని దుర్గారావు, ఉపాధక్షులు గద్దల రాజు,సిటీ, జిల్లా నాయకులు, రంగశాయిపేట్ యూత్ ఫోరమ్, సుభాష్ చంద్ర బోస్ పరపతి సంఘము కార్యవర్గం, దామర గుట్టల వాకర్స్ అసోసియేషన్ అభినందించారు. అవార్డు అందుకున్న రాజేష్  మాట్లాడుతూ ఈ అవార్డు తో బాధ్యత మరింత పెరిగిందని సహకరించిన సిబ్బందికి  జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారికి,  సిబ్బంది కి కృతజ్ఞతలు తెలియజేశారు.

Related posts

టెక్స్క బ్ చైర్మన్ మార్నేని రవీందర్రావును సన్మానించిన పిఎసిఎస్ వైస్ చైర్మన్

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర

కొత్తూరు జెండాలో 40 లక్షలతో అంతర్గత రోడ్ల నిర్మాణం