Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాధవరెడ్డికి ఉత్తమ సేవ ప్రతిభా అవార్డు  

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ, ఆగస్టు 15:  భారత79వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా, హన్మకొండలోని పరేడ్ గ్రౌండ్స్‌లో  జిల్లాలో పనిచేస్తున్న  వివిధ ప్రభుత్వ శాఖలలో ఉత్తమ  పనితీరు కనబరిచిన ఉద్యోగులకు రాష్ట్ర అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, జిల్లా కలెక్టర్ స్నేహా శబరీష్, పోలీసు కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ ప్రతిభా పురస్కారాలను అందజేశారు. గీసుకొండ గ్రామానికి చెందిన దొపతి మాధవరెడ్డి పోలీసు శాఖలో వివిధ స్థాయిల్లో శాంతి భద్రతల పరిరక్షణలో ఉత్తమ సేవలు చేసినందుకు హన్మకొండ జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం. అందుకున్నారు.మాధవరెడ్డి ఉత్తమ పోలీసు గా ఎంపికైనందుకు ఆయనను బంధుమిత్రులు శుభాకాంక్షలు తెలిపారు

Related posts

Erragattu gutta 14నుండి18వరక ఎర్రగట్టు గుట్ట వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

ఘనంగా చత్రపతి శివాజీ చక్రవర్తి జయంతి