జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ:17 గీసుగొండ మండలంలోని శాయంపేట హవెలి గ్రామంలో కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ (కే యం టి పి) ను ఉమ్మడి జిల్లా ప్రత్యేక అధికారి, ఫ్యూచర్ సిటీ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కే శశాంక ఆదివారం జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదతో కలిసి సందర్శించారు.ఈ సందర్భంగా కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో నిర్మిస్తున్న వరద కాలువ నిర్మాణ పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఆర్ ఓ ప్లాంట్ ను, నిర్మిస్తున్న ఆర్ ఓ బి ను ఆయన సందర్శించి వేగవంతంగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.వస్త్ర పరిశ్రమలోని గణేశా, ఈకోటెక్ పరిశ్రమలను సందర్శించి నిర్వహిస్తున్న ఉత్పత్తులను పరిశీలించారు.
అనంతరం అధికారులతో వరద కాల్వ నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 160 కోట్ల రూపాయలు మంజూరు చేయగా పనుల పురోగతిపై సమీక్షించారు. కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్ లో ఎన్ని పరిశ్రమలు ఏర్పడ్డాయని, వాటి పనులు ఎంతవరకు వచ్చాయని అధికారులతో సమీక్షించి, నిర్దేశిత గడువులోగా ఆయా పరిశ్రమలు పూర్తిస్థాయిలో నిర్వహణ జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమాల్లో టీజీఐఐసి జోనల్ మేనేజర్ అజ్మీర స్వామి నాయక్, నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్ వెంకటేశ్వర్లు, ఎస్ ఈ రాంప్రసాద్,ఈఈ సునీత, తహసిల్దార్ రియాజుద్దీన్, ఎన్ఐటి ప్రొఫెసర్ వంశీ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు

previous post