జై భారత్ వాయిస్ న్యూస్ శ్రీకాకుళం భుత్వ ఉద్యోగం అంటేనే పోటీ పరీక్షల్లో నెగ్గాలి అందుకోసం అకుంఠిత దీక్షతో కష్టపడి చదవాలి ఒక ఉద్యోగం సాధించాలంటే ఎంతో కష్టపడి చదివి పరీక్షలకు సిద్ధం కావాలి. కానీ కష్టపడితే ఏదైనా సాధించవచ్చు అని నిరూపించాడు నాగరాజు ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించారు.
ఆంధ్రప్రదేశ్ లో డీఎస్సీ పరీక్షల్లో పలు కేటగిరీల్లో పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలం పెదపెంకి గ్రామానికి చెందిన సారిపల్లి నాగరాజుకు మూడు ఉద్యోగాలు లభించాయి. నాగరాజు పీజీటీలో వందకు 83 మార్కులు, స్కూల్ అసిస్టెంట్ (తెలుగు విభాగం) పరీక్షలో 88.82 మార్కులు, టీజీటీ జోన్-1 ఆరో ర్యాంకు సాధించారు. నాగరాజు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఎంఏ తెలుగు, ఎంఫిల్ తెలుగు పూర్తి చేసి అక్కడే పీహెచ్ డి చేస్తున్నారు.

previous post