Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్  వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలంలోని *కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్ వరకు నూతన బస్ సర్వీస్ ను కలెక్టర్ డాక్టర్ సత్య శారద తో కలసి  పరకాల శాసనసభ్యులు  రేవూరి ప్రకాశ్ రెడ్డి ప్రారంభించారు సోమవారం కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ నుండి వరంగల్ బస్టాండ్, వరంగల్ బస్టాండ్ నుండి కాకతీయ మెగా టెక్స్ట్సైల్ పార్క్ వరకు ఆర్టీసీ బస్సు సేవలను వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద తో కలిసి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి  జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే  మాట్లాడుతూ.బస్సువయా ఊకల్ హవేలీ, గీసుకొండ  క్రాస్ రోడ్ ,ధర్మారం,జాన్ పీర్, వరంగల్ బస్టాండ్ మీదుగా వెళ్తుందని అన్నారు. టెక్స్టైల్ పార్క్లో పనిచేస్తున్న కార్మికులు, సిబ్బందితో పాటు సమీప గ్రామ ప్రజలకు బస్ సర్వీస్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం మహిళల సంక్షేమానికి కృషి చేస్తున్నదని, ఉచిత బస్సు సర్వీస్ ను సద్వినియోగం చేసుకోవాలన్నారు.
ప్రయాణ సౌకర్యాలు మెరుగుపడితేనే పరిశ్రమల అభివృద్ధి వేగవంతమవుతుందని అన్నారు. ఇండస్ట్రీ విజయవంతం కావాలంటే ప్రతి ఒక్కరూ సహకరించాలన్నారు.ప్రజా అవసరాల మేరకు రవాణా శాఖతో చర్చించి బస్ సర్వీస్ ఏర్పాటు చేస్తామని,భవిష్యత్తులో మరిన్ని మార్గాల్లో కొత్త బస్సులను అందించే దిశగా కృషి చేస్తామని అన్నారు.
జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద  మాట్లాడుతూ, “పారిశ్రామిక అభివృద్ధి కేవలం పరిశ్రమల స్థాపనతో మాత్రమే కాదని, కార్మికుల సంక్షేమంతో కూడిన అభివృద్ధి కావాలని, కార్మికులు ముఖ్యంగా మహిళల ఇబ్బందులు కలుగకుండా, సమయానికి తమ ఉద్యోగ స్థానాలకు చేరుకునేందుకు సరైన రవాణా సౌకర్యం ఉండటం ఎంతో అవసరమని తెలిపారు. కార్మికుల పనివేళల ప్రకారం బస్సు నడపాలని కోరారు. యంగ్ వన్, గణేశా కంపెనీ ప్రతినిధులు కూడా కృషి చేశారని అన్నారు. త్వరలో మరిన్ని ప్రాంతాల నుండి కెఎం టిపి కు బస్సు సేవలు కల్పిస్తామని అన్నారు.ఈ కొత్త ఆర్టీసీ బస్సు సేవలు రోజు  ఉదయం, సాయంత్రం వరంగల్ నుండి కెఎంటిపి వరకు, కెఎం టిపి నుండి వరంగల్ బస్టేషన్ వరకు నడుపబడుతుందని అన్నారు. తద్వారా అనేకమంది కార్మికులు ప్రయోజనం పొందనున్నారని తెలిపారు.కార్మికులు ఈ కొత్త సదుపాయంపై ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే,  జిల్లా కలెక్టర్ కు  ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో టిజిఐడిసి జోనల్ మేనేజర్ అజ్మీరా స్వామి నాయక్, ఆర్డీఓ సత్య పాల్ రెడ్డి, ఆర్టీసీ డిఎం ధరమ్ సింగ్, యంగ్ వన్, గణేశా మేనేజర్ లు కృష్ణమూర్తి, ఎంవి రెడ్డి, తహసీల్దార్ రియాజుద్దీన్, ఎంపిడిఓ,  కార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సర్వశిక్ష ఉద్యోగుల వినూత్న నిరసన

Jaibharath News

అమ్మ పేరుతో మొక్కలు నాటి సంరక్షించండి

Sambasivarao

రహదారిపై మొక్కజొన్నలు ఆరబోయవద్దు   ఎస్సై  కొంక అశోక్