జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 6683 గణపతి ప్రతిమలు పూజలందుకుంటున్నాయని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ తెలిపారు. గణపతి నవరాత్రులను పురస్కరించుకోని వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రశాంతవంతమైన వాతవరణంలో గణపతి నవరాత్రులు కోనసాగుతున్నాయని. వినాయక చవితి పండుగ కొద్ది రోజుల ముందు నుండే వరంగల్ పోలీసుల ప్రజల గణపతి మండపాలన నిర్వహణపై నిర్వహకులతో పాటు ప్రజలు అవగాహన కల్పించడంతో గతంలో ఎప్పుడు లేని విధంగా వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 6683 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో సెంట్రల్ జోన్ పరిధిలో 2675 విగ్రహాలను నెలకోల్పడగా, ఈస్ట్‌జోన్ పరిధిలో 2043 విగ్రహాలు, లాగే వెస్ట్ జోన్ పరిధిలో 1945 విగ్రహాలను ఏర్పాటు చేయడం జరిగింది. గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరంలో 50%శాతం అధికంగా గణేష్ మండళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రజలు, మండప నిర్వహకులు సైతం పోలీసుల పిలుపునందుకోని 6526 విగ్రహాలకు సంబంధించిన పూర్తి వివరాలను పోలీస్ ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవడం విశేషం. విగ్రహాల సంఖ్య పెరిగిన సంబందిత స్టేషన్ పోలీస్ అధికారులు, సిబ్బంది మాత్రం మరింత ఉత్సహంతో తమ పరిధిలోని ప్రతి గణపతి నవరాత్రి మండళ్ళను సందర్శించడం పాటు, నిర్వహకులు ఏర్పాటు చేసిన భద్రత ఏర్పాట్లపై పోలీసులు క్షేత్ర స్థాయిలో పరిశీలించడంతో పాటు నిర్వహకులకు పలు సూచనలు చేయడంతో పాటు. ఏర్పాటు చేసిన గణపతి విగ్రహాల ప్రదేశం వివరాలను ఖచ్చితం తెలుసుకోనేందుకుగాను స్థానిక పోలీసులు స్టేషన్ పరిధిలో విగ్రహాల వివరాలను జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. ఈ ఏడాది మొత్తం 6354పైగా విగ్రహాలను జియో ట్యాగింగ్ చేయడం జరిగింది. దీని ద్వారా స్థానిక పోలీస్ అధికారులు పెట్రొలింగ్ సిబ్బంది సైతం పగలు, రాత్రి సమయాల్లో గణపతి మండపాలను సందర్శించడంతో పాటు ఈ మండపాలలో ఏర్పాటు చేసిన పాయింట్ బుక్‌ల్లో పెట్రో సిబ్బంది సంతకాలు చేయడం ద్వారా మండప నిర్వహకులను సైతం అప్రత్తం చేయడం జరుగుతోంది. అలాగే ప్రధానం ప్రతి స్టేషన్ అధికారి తమ పరిధిలో నెలకొల్పబడిన గణేష్ విగ్రహాలను సందర్శించడంతో పాటు, నిర్వహకులను ఎప్పటికుప్పుడు తగిని రీతిలో సూచనలు చేస్తున్నారు. ఇదే రీతిలో త్వరలో నిర్వహించబడే నిరజ్జనం కార్యక్రమానికి సైతం మండప నిర్వహకులు, ప్రజలు సైతం పోలీసుల సూచనలను పాటిస్తూ నిమజ్జన కార్యాక్రమాన్ని విజయవంతం చేయగలరని పోలీస్ కమిషనర్ ప్రజలకు సూచించారు.

previous post