Jaibharathvoice.com | Telugu News App In Telangana
REPORTERSహన్మకొండ జిల్లా

వరంగల్ పోలీస్ సీపీ క్యాంపు కార్యాలయంలో ప్రత్యేక లౌంజ్ ప్రారంభం

వరంగల్ పోలీస్ కమిషనర్ క్యాంపు కార్యాలయంలో సీపిని కలిసేందుకు వచ్చే సందర్శకుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గది (లౌంజ్‌)ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సోమవారం ప్రారంభించారు.సందర్శకులకు సౌకర్యవంతమైన వాతావరణం కల్పించడమే లక్ష్యంగా ఈ లౌంజ్‌ ఏర్పాటు చేయబడింది. ఇందులో కూర్చునే సౌకర్యాలు, త్రాగునీటి సదుపాయం, పత్రికలు వంటి అవసరమైన సౌకర్యాలు కల్పించబడ్డాయి.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ – “ప్రజలు పోలీస్ కార్యాలయానికి వచ్చే సందర్భంలో వేచి ఉండే సమయంలో ఇబ్బందులు పడకుండా ఉండేందుకు ఈ లౌంజ్ ఉపయోగపడుతుంది. ప్రజలకు సౌకర్యం కల్పించడం మా ప్రాధాన్యత” అని అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ లు రవి, ప్రభాకర్ రావు, శ్రీనివాస్, ఏసీపీలు జితేందర్ రెడ్డి, నాగయ్య, డేవిడ్ రాజు తో ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వసతిగృహాలను జిల్లా కలెక్టర్‌ ప్రావిణ్య తనిఖీలు

డీజే సౌండ్ సిస్టమ్ వినియోగం నిషేధం

భూభారతి చట్టంపై రైతులు, ప్రజలు అవగాహనను పెంపొందించుకోవాలి