Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

సీఎంగా చంద్రబాబు 30ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా టిడిపి శ్రేణులు సంబరాలు

జై భారత్ వాయిస్ న్యూస్ అనంతపురం
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో నేను ఐదేళ్ల పాటు మంత్రిగా పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత అన్నారు. ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసి మూడు దశాబ్దాలైన సందర్భంగా ఆమె అనంతపురంలో సంబరాలు చేసుకున్నారు. తన క్యాంపు కార్యాలయంలో రాప్తాడు నియోజకవర్గ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు. రాప్తాడు నియోజకవర్గ ప్రజల తరుఫున ముఖ్యమంత్రి చంద్రబాబుకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రబాబు సీఎంగా తొలిసారి బాధ్యతలు చేపట్టి నేటితో 30 ఏళ్లు పూర్తైందని.. తెలుగు నేలపై 4 సార్లు సీఎంగా పనిచేసిన ఏకైక వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఇది రానున్న రోజుల్లో ఎవరూ సాధించలేని ఘనత అన్నారు. తన జీవితంలో ఎన్నో సంక్షేభాలు, అవరోధాలు ఎదుర్కొని నిలబడ్డారని.. పార్టీ కూడా ఎన్నో సంక్షోభాలు చూసినా ఆయన చాణిక్యతతో మళ్లీ విజయాల్ని అందించారన్నారు.. హైదరాబాద్ లాంటి మహానగరానికి అంత కీర్తి ఉందంటే అది చంద్రబాబు ఘనతేనన్నారు. ఆరోజు హైటెక్ సిటి నిర్మించకపోయి ఉంటే.. హైదరాబాద్ పరిస్థితి మరోలా ఉండేదన్నారు. మొదటి నుంచి యువత కొత్త మార్గంలో వెళ్లేలా చూస్తున్న నాయకుడు చంద్రబాబు అన్నారు. చిన్నపిల్లాడి దగ్గర నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరికీ చంద్రబాబే స్ఫూర్తిగా ఉంటారన్నారు. టెక్నాలజీతో ఏమైనా సాధించవచ్చని మొదటి నుంచి నమ్మారని.. ఇప్పుడు వ్యవసాయంలోకి కూడా టెక్నాలజీని తీసుకొచ్చి కొంత పుంతలు తొక్కిస్తున్నారన్నారు. ఆ రోజు డ్రిప్పు, స్ప్రింక్లర్లను రాష్ట్రానికి పరిచయం చేశారని.. ఇప్పుడు డ్రోన్ ల ద్వారా పిచికారి చేసే విధానాన్ని తీసుకొచ్చారన్నారు. ఇలా అనేక నిర్ణయాలు, అంశాలు ఆయన నుంచి స్ఫూర్తి పొందానన్నారు. తనను రాజకీయంగా ప్రోత్సహించిన ఆయన.. ఏ కష్టం వచ్చినా వెన్నంటే నిలిచారన్నారు. రాజకీయాల్లో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాకు గురువు లాంటి వారని ఎమ్మెల్యే సునీత అన్నారు…

Related posts

గురుకుల పాఠశాల నిర్మాణం పూర్తి చేసి అందుబాటులోకి తెస్తాం

టిడిపి సభకు తరలి వెళ్ళిన కుందుర్పి  మండల కార్యకర్తలు

మహాశివరాత్రి సందర్భంగా అక్కమ్మ వారి బియ్యం బస్తాల పంపిణీ

Jaibharath News