జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా హనుమకొండ అంబేద్కర్ జంక్షన్ నుండి వరంగల్ జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు తెలంగాణ ఉద్యోగుల వరంగల్ జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించడం సోమవారం నాడు నిర్వహించారు.ఈ ర్యాలీలో అన్ని ప్రభుత్వ శాఖల ఉద్యోగ ఉపాధ్యాయ గెజిటెడ్ అధికారులు, పెన్షనర్లు,కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు, నాలుగో తరగతి ఉద్యోగులు డ్రైవర్ సంఘాలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా జిల్లా చైర్మన్ గజ్జెల రామ్ కిషన్ మాట్లాడుతూ ఉద్యోగులకు శాపంగా మారిన సిపిఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ కొనసాగించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మొండి వైఖరికి నిరసనగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని అన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వాలు ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉదృతం చేస్తామన్నారు. కన్వీనర్ మణికుమార్ మాట్లాడుతూ పెన్షన్ అనేది ఉద్యోగి హక్కుఅని, సేవ చేస్తానని వచ్చిన పాలకులకు పెన్షన్ వస్తుందని,30 సంవత్సరాల సర్వీసు పూర్తి చేసిన ఉద్యోగికి పెన్షన్ లేకపోవడం దురదృష్టకరమని వారన్నారు.ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా చైర్మన్ ఆకుల రాజేందర్, టీజివో వరంగల్ జిల్లా అధ్యక్షులు రామ్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షులు అన్నమనేని జగన్మోహన రావు ,టీఎన్జీవో జిల్లా కార్యదర్శి గాజె వేణుగోపాల్, ట్రెసా జిల్లా అధ్యక్షులు రాజ్ కుమార్, యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు తాటికాయల కుమార్, కార్యదర్శి సృజన్ ప్రసాద్, డిటిఎఫ్ జిల్లా అధ్యక్షులు గంగాధర్,టిపీటీఎఫ్ జిల్లా అధ్యక్షులు ఊటుకూరి అశోక్ , టిఆర్టిఎఫ్ అధ్యక్షులు వడ్డే కిషన్ పిఆర్టియు కార్యదర్శి నామోజు శ్రీనివాస్, టీఎన్జీవో జిల్లా కోశాధికారి పాలకుర్తి సదానందం, సహాధ్యక్షులు లావుడియా హేమానాయక్,, తెలంగాణ పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మరాజు,స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు తుమ్మ వీరయ్య, కార్యదర్శి సదానందం పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు సోమయ్య,పాకాల శేఖర్, నాలుగో తరగతి ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షులు సాంబయ్య,కార్యదర్శి భాను ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు గద్దల రాజు,వంశీధర్ బాబు, ఇంద్రసేనారెడ్డి,బత్తిని రమాదేవి, జిల్లా సహాయ కార్యదర్శిలు రజనీకాంత్,రామకృష్ణ, సుభాష్, భాను ప్రకాష్,జిల్లా ప్రచార కార్యదర్శి గణేష్, వరంగల్ పట్టణ శాఖ అధ్యక్షులు శంకేశి రాజేష్, కార్యదర్శి మధుచంద్ర, కార్యవర్గ సభ్యులు సభ్యులు సందీప్, చిరంజీవి, గంగాధర్, నర్సంపేట తాలూకా అధ్యక్షులు కడారి సురేష్ రెడ్డి,కార్యదర్శ హర్షవర్ధన్, వర్ధన్నపేట అధ్యక్షుల దేవేందర్, కార్యదర్శి రవికుమార సంగం యూనిట్ అధ్యక్షులు కిరన్ కుమార్ , నెక్కొండ అధ్యక్షులు శ్యాంసుందర్, రూరల్ యూనిట్ కార్యదర్శి ఆనందరావు పంచాయతీ కార్యదర్శుల ఫోరం అధ్యక్షులు నాయక్, వెటర్నరీ ఫోరం అధ్యక్షులు సుమన్ జిత్ర, అగ్రికల్చర్ ఫోరం అధ్యక్షులు నటరాజ్, కార్యదర్శి సునీత, మెడికల్ ఫోరమ్ నాయకులు శ్రీనివాస్ నాగేశ్వర్ రావు, కిషన్ నాయక్, టేస్సా అధ్యక్షులు అనిల్ కార్యదర్శి హనుమంతు, కోఆపరేటివ్ ఫోరం కార్యదర్శి వినోద్, వ్యవసాయ మార్కెట్ ఫోరం నాయకులు ,మురళియాదవ్,వివేక్, ఐసిడిఎస్ ఫోరం అధ్యక్షురాలు రాజేశ్వరి, మరియు వివిధ సంఘాల బాధ్యులు రాష్ట్ర జిల్లా నాయకులు కల్లెపు సదానందం, లక్ష్మారెడ్డి,, శ్రీనివాస్, ఉపేందర్, సుధాకర్, విమల, రజిత, లలిత, తదితరులు పాల్గొన్నారు.
