Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సెప్టెంబర్ 4న కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 4 వ తేది ఉదయం 9.30 నిమిషాలకు, విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో ప్రారంభిస్తునట్టు గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కన్వీనర్ ఆచార్య జి.సమ్మయ్య తెలిపారు. కార్యక్రమానికి సంబందించిన ఆహ్వన పత్రికను వైస్ ఛాన్సలర్ ఆచార్య కే. ప్రతాప్ రెడ్డి రిజిస్ట్రార్ ఆచార్య వి. రామచంద్రం కు అందచేసినట్టు కళాశాల ప్రిన్సిపాల్,గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ చైర్మన్ ఆచార్య జే.కృష్ణవేణి ఒక ప్రకటనలో తెలిపారు, గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ కన్వీనర్ గా ఆచార్య జి.సమ్మయ్య, ఆర్గనైజేషన్ సెక్రటరీ ఆచార్య వై. నరసింహ రెడ్డి వ్యవహరిస్తారని ఆమె తెలిపారు. కాకతీయ విశ్వవిద్యాలయ ఫార్మసీ కాలేజీ గోల్డెన్ జూబిలీ సెలబ్రేషన్స్ సెప్టెంబర్ 4 వ తేది ఉదయం 9.30 నిమిషాలకు, విశ్వవిద్యాలయ సెనెట్ హాల్ లో ప్రారంభిస్తారని తెలిపారు.

Related posts

హనుమకొండ జిల్లాలో 25 నుండి ఓటరు సమాచార స్లిప్పుల పంపిణి

జైభారత్ వాయిస్ న్యూస్ హనుమకొండ  అక్టోబర్ 3

లింగ సమానత్వం ద్వారా బాలల పరిరక్షణ