(జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట)శ్రీ గణపతి అనుగ్రహం ఆశీస్సులు డివిజన్ ప్రజలందరిపై ఉండాలని గ్రేటర్ వరంగల్ నగరంలోని 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ ఆ భగవంతున్ని ప్రార్థిస్తున్నానని అన్నారు. శ్రీ గణపతి నవరాత్రి ఉత్సవముల సందర్భంగా సోమవారం రోజున 42 వడివిజన్ రంగసాయిపేటలోని శ్రీ సీతారామచంద్ర స్వామి దేవాలయ ఆవరణలో, శ్రీ మహంకాళి దేవాలయం ముందు, ఆదర్శ కాలనీలో, ఖమ్మం రోడ్డు శంభునిపేట ఆడేపు రఘు హోటల్ వద్ద, శ్రీ లక్ష్మీ గణపతి పరపతి సంఘం వద్ద ఏర్పాటుచేసిన శ్రీ వినాయక మండపాలలో కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ దంపతులు పాల్గొని శ్రీ విఘ్నేశ్వర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం జరిగిన అన్నదాన కార్యక్రమాలలో పాల్గొన్నారు.
