Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

108 రకాలతో వినాయకుడికి నైవేద్యం

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్)భక్తి మార్గంతోనే మోక్షం ప్రాప్తిస్తుందనీ, ఆధ్యాత్మికతో విశ్వశాంతి చేకూరుతుందని బిజెపి జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ పేర్కొన్నారు. వరంగల్ లోని సత్యం కంప్యూటర్స్ ఎడ్యుకేషన్ లో భక్తి శ్రద్ధలతో గణపతి నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా సోమవారం గణనాథునికి 108 రకాల ఫల,పిండి పదార్థాలతో నైవేద్యాలు సమర్పించారు. సత్యం కంప్యూటర్ ఎడ్యుకేషన్ సంస్థల అధినేత, బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ మాట్లాడుతూ భక్తి శ్రద్ధలతో వినాయకుడిని పూజిస్తే సకల కోరికలు నెరవేరుతాయని అన్నారు.గత 24 సంవత్సరాల నుండి తమ సంస్థలో నవరాత్రి వేడుకలు నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.ప్రజలంతా స్వామివారి కృపతో సుఖ సంతోషాలతో ఉండాలని రవికుమార్ ఆకాంక్షించారు. ఆరోగ్యమే మహా భాగ్యమని ప్రతీ ఒక్కరు ఆరోగ్య నియమాలు పాటించి ఆయురారోగ్యాలతో ఉండాలనే ఉద్దేశ్యం తో వారి డ్రై ఫ్రూట్స్ గణపతిని ఏర్పాటు చేసినట్టు పేర్కొన్నారు. గణపతి వేడుకలు ప్రతీ ఒక్కరు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాక్షించారు.

Related posts

మహారాష్ట్ర విజయం మోడీ ఛరిష్మాకు నిదర్శనం

విదేశాలకు వెళ్ళేందుకు చోరీలకు పాల్పడతున్న దొంగ అరెస్టు

వరంగల్ టీమ్స్ ఆస్పత్రి వ్యయం పెంపుపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన సీఎం