(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు):
మాజీ సీఎం వైయస్ రాజశేఖర్ రెడ్డి ఆశయాలను కొనసాగించాలని ఆత్మకూరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కమలాపురం రమేష్ అన్నారు.. ఆత్మకూరు మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో స్వర్గీయ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి వెల్దే వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో వైయస్ రాజశేఖర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కమలాపురం రమేష్ మాట్లాడుతూ వైయస్ రాజశేఖర్ రెడ్డి అమలు చేసిన సంక్షేమ పథకాలు ప్రజల గుండెల్లో స్థిరస్థాయిగా నిలిచిపోయాయని అన్నారు. ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఉచిత విద్య, రైతుల రుణమాఫీ, ఇందిరమ్మ గృహ నిర్మాణం, వికలాంగులకు పెన్షన్ వంటి అనేక సంక్షేమ పథకాలు ప్రతిష్టాత్మకంగా అమలు చేసిన ఘనత వైయస్సార్ కే దక్కిందని అన్నారు. ఆయన ఆశయాలను కార్యకర్తలు కొనసాగించాలన్నారు. మండల వర్కింగ్ ప్రెసిడెంట్ పరికిరాల వాసు, మాజీ పి ఎస్ సి ఎస్ చైర్మన్ ఏరుకొండ రవీందర్ గౌడ్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు రేవూరి జైపాల్ రెడ్డి ,మాజీ సర్పంచ్ నాగేల్లి సామెల్, మార్కెట్ డైరెక్టర్ కాడబోయిన రమేష్ ,స్థానిక గ్రామ పార్టీ అధ్యక్షుడు బయ్య కుమారస్వామి, మండల నాయకులు చిమ్మని దేవరాజ్, కోల రమేష్, వడ్డేపల్లి ప్రసాద్, అల్వాల రవి ,మన గాని తిరుపతి, పొగాకుల రాజు, కాడ మీద రమేష్, తాళ్ల కిరణ్, , కాంగ్రెస్ మండల నాయకులు, యూత్ నాయకులు,కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post