(జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ)ఉద్యాన పంటల్లో నానో యూరియా వినియోగించి భూసారాన్ని కాపాడుకోవాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద అన్నారు.బుధవారం గీసుగొండ మండలంలో డ్రోన్ ద్వారా తిమ్మాపురం శ్రీకాంత్ వంకాయ తోటలో (నానోయూరియా ) పచికారీ చేయించడం జరిగింది. క్షేత్ర ప్రదర్శనలో జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గోని రైతులకు ఉద్యాన పంటల్లో నానో యూరియా వాడకం వల్ల కలిగే ప్రయోజనాలపై అవగాహన కల్పించారు.కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, తీగ జాతి కూరగాయలైన సోర్ట్, బీర్ కాండోర్, దొండ, దోస, పొట్ల, బోడకాకర్ తదితర పంటల్లో ఈదశలో నేలపై మొత్తం పరుచుకొని ఉండడం వల్ల డ్రోన్ సాయంతో నానోయూరియా స్ప్రే చేయడం వల్ల నత్రజని వినియోగ సామర్థ్యం పెరిగి మొక్క ఎదుగుదల జరిగి అధిక దిగుబడులు పొందవచ్చని, దీనికి బదులుగా “ఘన రూపంలో ఉన్న యూరియా బస్తాలు వాడితే మొక్కకు సరిగా అందక ఎక్కువగా పృథా అవుతుందని అన్నారు.శాశ్వత తీగజాతి కూరగాయల సాగులో పందిళ్ళా పైన పోషకాలు పురుగు మందుల పిచికారీ చేయడం, సాధారాణ స్ప్ర్పేయర్స్ తో కష్టంతో కూడిన పనియని, అదే డ్రోన్ ద్యారా సులభంగా ఎకర విస్తీర్ణంనకు 10 నిమిషాల్లో పిచికారి చేయచ్చునని అన్నారు.అరటి, బొప్పాయి, మొనగ లాంటి ఎక్కువ ఎత్తి పెరిగే ఉద్యాన పంటల్లో డ్రోన్ ద్వారా పోషకారమైన నానో యారియా పిచికారి చేసుకోవచ్చునని అన్నారు . నానో యూరియా అనేది నత్రజనిని మొక్కలకు మరింత సమర్థవంతంగా అందించే అంజనే ద్రవ ఎరువని, దీన్ని సమర్థవంతంగా పంటల చురుకైన పెరుగుదల దశలో లీటర్ మీటర్ నీటికి 2-4మి.లీ. చొప్పున కలిపి ఆకులపై పాచికారి చేయాలి. నానో యూరియా చిన్న కణాల రూపంలో ఉడటం వల్ల మొక్కలు వేగంగా, సులభంగా గ్రహిస్తాయని, మొక్కలు బాగా ఎదిగి నాణ్యమైన దిగుబడులు వస్తాయని,. ఇంతే కాకుండా వాము, భూ కాలుష్యం పర్యావరణానికి ఎటువంటి నష్టం ఉండదని అన్నారు.ఈ సందర్భంగా రైతుల అభిప్రాయాలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఇప్పటికే నానో యూరియా వాడిన రైతులు మిగిలిన రైతులతో వారి అనుభవాలను పంచుకొని ఉద్యాన పంటల సాగులో పెద్దఎత్తున నానోయూరియా వాడకాన్ని ప్రోత్సహించాలని అన్నారు.కలెక్టర్ వెంట జిల్లా ఉద్యాన అధికారి శ్రీనివాసరావు, జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ, తహశీల్దార్ రియాజుద్దీన్, ఉద్యాన అధికారి తిరుపతి, ఎంఎఓ హరిప్రసాద్, హెచ్ఈఓ వేణు, ఏఈఓ రజని, కావ్య తదితరులు పాల్గొన్నారు.

previous post