జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ: విద్యార్థుల్లో అభ్యసన సామర్ధ్యాలు మరింత మెరుగుపరిచే విధంగా ఉండాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు.మంగళవారం హనుమకొండ లష్కర్ బజార్ లోని అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ను జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో ఉన్న సదుపాయాలు, విద్యార్థుల సంఖ్య, సమస్యలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా ఐదు, ఆరు, ఏడు తరగతులను సందర్శించి విద్యార్థులతో కలెక్టర్ మాట్లాడారు. విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పరీక్షించేందుకు తెలుగు ఆంగ్లం గణిత పాఠ్యాంశాలను విద్యార్థులతో కలెక్టర్ చదివించారు. ఈ నెలలో నిర్వహించనున్న మిడ్లైన్ టెస్ట్ కు ఏవిధంగా సన్నద్ధమవుతున్నారని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. కిచెన్ ను పరిశీలించి భోజనం ఎలా ఉంటుంది, మెనూ ప్రకారం అందిస్తున్నారా అని కలెక్టర్ ఆరా తీశారు. డార్మెట్రీ ని కూడా పరిశీలించారు. వాటర్ సమస్య ఉండగా దాని గురించి వివరాలు అడిగి తెలుసుకుని త్వరగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. హాస్టల్లో సదుపాయాలు బాగా ఉండాలని సూచించారు. తప్పనిసరిగా మెనూ ప్రకారం విద్యార్థులకు భోజనం అందించాలన్నారఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి వాసంతి, హనుమకొండ ఎంఈవో నెహ్రూ, తదితరులు పాల్గొన్నారు.

previous post
next post