Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సుధాకర్ కు తెలుగు సాహితీ అవార్డు

(జై భారత్ వాయిస్ న్యూస్ నర్సంపేట):తెలుగు భాషా సాహిత్య అభివృద్ధి కి కృషి చేస్తున్న వరంగల్ జిల్లా ఖానాపురం మండలం మను బోతుల గడ్డ హైస్కూల్లో పనిచేస్తున్న తెలుగు భాష ఉపాధ్యాయుడు బేరె సుధాకర్ కు అవార్డు లభించింది. హైదరాబాదు లోని రవీంద్రభారతిలో భాషా చైతన్య సమితి, కుసుమ ధర్మన్న కళాపీఠం గోల్కొండ సాహితీ కళా సమితి సంయుక్త ఆధ్వర్యంలో ప్రజాకవి కాలోజీ నారాయణరావు జయంతి వేడుకల సందర్భంగా తెలంగాణ సాహిత్య అకాడమీ పూర్వ అధ్యక్షుడు డాక్టర్ నందిని సిద్ధారెడ్డి ఉపాధ్యాయుడు సుధాకర్ ను ప్రశంసా పత్రంతో సత్కరించారు. కవి సమ్మేళనం ఆహుతులను ఆకట్టు ఉంది. ఈ సందర్భంగా బేరే సుధాకర్ మాట్లాడుతూ తెలుగు సాహిత్య అభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాను అని తెలిపారు. ఈ అవార్డు అందుకున్న సుధాకర్ ను మనుబోతుల గడ్డ హై స్కూల్ హెడ్మాస్టర్ జి వెంకన్న, ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కే అశోక్, ఉపాధ్యాయ బృందం సభ్యులు అభినందించారు

Related posts

ఓరుగల్లు భద్రకాళి అమ్మవారు ఉగ్రా క్రమం అలంకరణలో దర్శనం

ఆర్ఎంపి పి.ఎం.పి సంఘాల నిరసన ర్యాలీ

వరంగల్ జిల్లాలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ పర్యటన