జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట)
గ్రేటర్ వరంగల్ నగరంలోని రంగశాయిపేట లోని మహంకాళి గుడి ఆవరణలో అక్టోబర్ 2వ తేదీ విజయదశమి పండుగ రోజున రావణవధ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తామని దసరా ఉత్సవ సమితి అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అన్నారు. బుధవారం రోజున రంగసాయిపేట కాంక్ష కన్వెన్షన్ హాల్ నందు దసరా ఉత్సవ సమితి సమావేశము అధ్యక్షులు గుండు పూర్ణచందర్ అధ్యక్షతన జరిగినది. ఈ సందర్భంగా గుండు పూర్ణచందర్ మాట్లాడుతూ రంగసాయిపేట లోని మహంకాళి గుడి ఆవరణలో గత 42 సంవత్సరములుగా ఈ రావణ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అందులో భాగంగానే అక్టోబర్ రెండవ తేదీ దసరా పండుగ రోజున రావణ కార్యక్రమాన్ని నిర్వహించడానికి ఏర్పాట్లు మొదలు పెడుతున్నామని అన్నారు. ఈ కార్యక్రమానికి కార్పొరేషన్ పరంగా ప్రభుత్వపరంగా ఏర్పాట్లు చేయడానికి గాను రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మాత్యులు కొండ సురేఖ మురళీధర్ రావు, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి తో పాటు జిల్లా కలెక్టర్, కమిషనర్, ఇతర సంబంధిత అధికారులు అందరినీ కలిసి వినతి పత్రాలు సమర్పిస్తామని తెలియజేశారు.ప్రధాన కార్యదర్శి దామెరకొండ కరుణాకర్ మాట్లాడుతూ విజయదశమి పండుగ రోజున నిర్వహించే ఈ రావణ కార్యక్రమానికి ప్రజలందరూ సహకరించి విజయవంతం చేయాలని కోరారు. ఉత్సవ సమితి ప్రతినిధులందరూ కూడా విజయవంతం చేయడంలో భాగస్వాములు కావాలని అన్నారు. ఈ సమావేశంలో ఉపాధ్యక్షులు పరికిపండ్ల రాజేశ్వర్ రావు, డాక్టర్ కోట శ్రీధర్ కుమార్, వలుపదాసు రాజశేఖర్, కోశాధికారి కొక్కొండ భాస్కర్, కార్యదర్శులు కంచ రమేష్, డాక్టర్ రేణికుంట్ల ప్రవీణ్ కుమార్, పాకాల మనోహర్, బజ్జూరి వీరేశం, పస్తం బిక్షపతి, వంగరి శ్రీనివాస్, కత్తెరపల్లి వేణు, ముఖ్య సలహాదారులు బివి రామకృష్ణ ప్రసాద్, చిమ్మని చంద్రమౌళి, కమిటీ సభ్యులు బక్కి వంశీ, గుండు నవీన్ కుమార్, దేవునూరి వెంకటేశ్వర్లు, కన్నెబోయిన కుమార్ తదితరులు పాల్గొన్నారు.

previous post