కాకతీయ యూనివర్సిటీ మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో నూతనంగా ప్రారంభమైన ఎన్.సి.సి. విభాగం ఆధ్వర్యంలో ఇంజనీరింగ్ మొదటి సంవత్సరం చదువుతున్న విద్యార్థినిలకు కే.రమణ రావు సీనియర్ జెసిఓ సుబేదార్ 8(టి) గర్ల్స్ బెటాలియన్ ఎన్.సి.సి గారి పర్యవేక్షణలో ఎంపిక ప్రక్రియ నిర్వహించారు.ఈ కార్యక్రమంలో 100కు పైగా విద్యార్థినిలు పాల్గొనగా, అందులో నుండి 35 మంది విద్యార్థినిలు ఎంపికయ్యారు. మిగతా 15 మంది విద్యార్థినిలు రిజర్వులో ఉన్నారు.ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కే. భిక్షాలు గారు మాట్లాడుతూ, విద్యార్థినిలు అన్ని రంగాల్లో రాణించాలని ముఖ్యంగా ఎన్.సి.సి. లో ఉండడం వల్ల క్రమశిక్షణ ,ఏకాగ్రత, దేశం పట్ల భక్తి మరియు మానసిక ఉల్లాసం మొదలైన లక్షణాలు పెంపొందించబడతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎన్.సి.సి. విభాగం కేర్ టేకర్ వై . యశస్విని గారు మరియు కళాశాల అధ్యాపకులు మరియు కళాశాల సూపరిండెంట్ వీరు నాయక్ బానోత్ గారు ఎంపికైన విద్యార్థినిలకు శుభాకాంక్షలు తెలిపారు.
