గ్రేటర్ వరంగల్ నగరంలోని ఓసిటీలోని మంత్రి క్యాంపు కార్యాలయంలో కొండా సురేఖ బుధవారం నాడు 42 వడివిజన్ కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్ తో కలిసి 34 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను అందజేసినారు.ఈ సందర్భంగా కొండా సురేఖ మాట్లాడుతూ పేద ప్రజల సొంతింటి కల ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం వలన నెరవేరుతుందని అన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్ల విషయంలో ప్రత్యేక దృష్టి సారించిందని అన్నారు. 42వ డివిజన్లో అర్హులైన మిగతా లబ్ధిదారులకు త్వరలోనే మంజూరు పత్రాలను అందజేస్తామని తెలిపారు.42వ డివిజన్ కార్పొరేటర్, డివిజన్ ఇందిరమ్మ కమిటీ చైర్ పర్సన్ గుండు చందన పూర్ణచందర్ మాట్లాడుతూ మా 42 వడివిజన్లో సొంత స్థలం ఉండి ఇండ్లు లేని వారు ఇంకా చాలామంది అర్హులైన లబ్ధిదారులు ఉన్నారని వారందరికీ కూడా ఇందిరమ్మ ఇండ్లను మంజూరు చేయాలని మంత్రి కొండా సురేఖ గారిని కోరారు. వెంటనే స్పందించి మంజూరు చేస్తానని కొండ సురేఖ హామీ ఇచ్చినందున మా డివిజన్ ప్రజలందరి తరపున కొండా సురేఖ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నారని గుండు చందన పూర్ణచందర్ అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు గోపాల నవీన్ రాజ్, డివిజన్ అధికారి ఆరోగ్యం, డివిజన్ అధ్యక్షులు ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఎలుగు సాంబేశం, మజ్జిగ తిరుమల్, కందగట్ల హరిత తో పాటు డివిజన్ నాయకులు బొలుగొడ్డు అనిల్, పాలకుర్తి సుమన్ మరియు లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

next post