జై భారత్ వాయిస్ న్యూస్ మహబూబ్ నగర్
మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది అని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. మహబూబ్ నగర్ నగరం లోని శిల్పారామంలో మహబూబ్ నగర్ కార్పోరేషన్ లో పనిచేస్తున్న 400 మంది పారిశుద్ధ్య కార్మికులకు పిపిఈ కిట్లు, యూనిఫాంలను జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీరంతా కష్టపడి పనిచేస్తున్నందుకే మహబూబ్ నగర్ పరిశుభ్రంగా ఉందన్నారు. గతంలో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ గా ఉండేదని, ఇప్పుడు కార్పోరేషన్ గా అభివృద్ధి చెందిందని మనందరిపైన బాధ్యత మరింతపెరిగిందన్నారు. మీ సమస్యలను పరిష్కరిస్తామని, మీ అందరికి కూడా ఆరోగ్య భీమా గురించి అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుంటామన్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి మాట్లాడుతూ మీరు పట్టణంలోని ప్రతి కాలనీలను శుభ్రం చేయడం వల్లనే మహబూబ్ నగర్ నగరం అంతాకూడా పరిశుభ్రంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ బెక్కెరి అనిత మధుసూదన్ రెడ్డి, డిసిసి ప్రధాన కార్యదర్శి సిరాజ్ ఖాద్రీ, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ ప్రవీణ్ కుమార్ రెడ్డి మరియు మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు.

previous post