జై భారత్ వాయిస్ హన్మకొండ
వరంగల్ జిల్లా న్యాయ సేవాధికార సంస్థ, : ఆధ్వర్యంలో సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్ ను వరంగల్ జిల్లా కోర్టులో నర్సంపేట మండల కోర్టులో నిర్వహించడానికి పూర్తి ఏర్పాట్లు చేస్తున్నామని వరంగల్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి కె.రాధాదేవి తెలిపారు కక్షిదారులు తమ వీలును బట్టి తమ కేసులను షసెప్టెంబర్ 2నుండి 9 సాయంత్రం లోపు ఏ రోజైనా రాజీ కుదుర్చుకునేలా ప్రీ-లోక్ అదాలత్ ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ లో రాజీపడదగు క్రిమినల్, సివిల్ కేసులు, భూ తగాదాల కేసులు, మోటార్ వెహికిల్ యాక్సిడెంట్ కేసులు, వివాహ మరియు కుటుంబ తగాదా కేసులు, బ్యాంకు, చెక్ బౌన్స్, ఎలక్ట్రిసిటీ, చిట్ ఫండ్, డిజాస్టర్ మేనేజ్మెంట్ కేసులు, ఇన్సూరెన్స్ కేసులు, ఎక్సైజ్ కేసులు, విద్యుత్ చోరీ, కన్సూమర్ ఫోరమ్ కేసులు, ట్రాఫిక్ ఈ-ఛాలన్ కేసులు మరియు ప్రీ- లిటిగేషన్ కేసులు మరియు ఇతర రాజీపడదగు కేసులను ఇరుపక్షాల అంగీకారంతో పరిష్కరించుటకు సిద్ధంగా ఉన్నామని తెలుపారు. ప్రీ-జాతీయ లోక్ అదాలత్ నందు కక్షిదారులు హాజరు అయ్యి, తమ తమ కేసులను వారికి వీలయిన రోజునే పరిష్కరించుకునేలా అవకాశం కల్పిస్తున్నామన్నారు. జాతీయ లోక్ అదాలత్ లో రాజీపడదగు కక్షిదారులు తమ తమ కేసుల వివరాలను సంబంధిత కోర్టులలో తెలియపరిచి, రాజీ కుదుర్చుకుని, కోర్టుల చుట్టూ తిరగకుండా ప్రశాంతమైన జీవనాన్ని కొనసాగించాలని తెలియజేశారు. రాజీపడదగు కక్షిదారులు తమ న్యాయవాదులతో కోర్టులకు నేరుగా హాజరు కావాలని తెలిపారు. ఈ ప్రీ-లోక్ అదాలత్ పట్ల ఎటువంటి సలహాలకైననూ, సందేహాలకైననూ, ఏదేని న్యాయసహాయం కొరకు అయిననూ న్యాయసేవాధికార సంస్థ ను ఆశ్రయించి, ఉచిత న్యాయ సలహాలు, సూచనలు పొందవలసిందిగా తెలియజేసశారు. ప్రీ-లోక్ అదాలత్ పట్ల మరింత సమాచారం కొరకు 9391807362 నంబర్ కు కాల్ చేసి, సందేహాలను నివృత్తి చేసుకోగలరని తెలిపారు.
previous post
next post