జై భారత్ వాయిస్ నూజివీడు
*అన్నాచెల్లెళ్ల ప్రేమకు నిదర్శనం రాఖీ పర్వదినాన్ని పురస్కరించుకొని తెలుగు మహిళలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ మాజీ శాసనసభ్యులు ముద్దరబోయిన వెంకటేశ్వరరావుకి రాఖి కట్టి పండుగను ఘనంగా నిర్వహించారు. సాంప్రదాయ బద్దంగా రాఖీ కట్టి తన సోదరుడు ముద్దరబోయినకు ఎల్లవేళలా అండగా ఉంటామని పేర్కొంటూ ముద్దరబోయిన ఆశీస్సులను తెలుగు మహిళలు తీసుకున్నారు.ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగు మహిళ అధ్యక్షురాలు యనమదల ఉషారాణి , రాష్ట్ర తెలుగు మహిళ నాయకురాలు ముద్రకొళ్ళ జయలక్ష్మి , శీలం పద్మా, భూక్య నాగమణి , యార్లగడ్డ రాధా కుమారి , మాదాసు చంద్రకళ ,వేమూరి లక్ష్మి గౌరీ , శ్రీరామ జయలక్ష్మి , పల్లి రమణ , పల్లి ఆదిలక్ష్మి, పల్లి సంధ్యా , తెలుగు మహిళలు పాల్గొన్నారు.*

previous post