జై భారత్ వాయిస్ ఆత్మకూరు):
సీఎం కేసీఆర్‌తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని.. సమైక్య పాలనలో పడ్డ గోసలు ఇప్పుడు లేవని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారు అన్నారు.ఆత్మకూరు మండల కేంద్రానికి చెందిన కాంగ్రేస్ పార్టీ జిల్లా కార్యదర్శి,ఆత్మకూరు మండల మున్నూరు కాపు సంఘం అధ్యక్షులు పూజారి రాము, బిజెపి పార్టీ కి చెందిన మాజీ వార్డు మెంబర్ తోట సాంబయ్య పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గారి సమక్షంలో బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ..కేసీఆర్ జనరంజక పాలన, సంక్షేమ కార్యక్రమాలు, పరకాల నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధికి ఆకర్షితులై బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.రాష్ట్రంలో ప్రతిపక్షాలకు చోటులేదన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్‌ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలన్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామపార్టీ అధ్యక్షులు పాపని రవీందర్,వైస్ ఎంపిపి రేవూరి సుధాకర్ రెడ్డి,ఉప సర్పంచ్ వంగాల స్వాతి భగవాన్ రెడ్డి,కో ఆప్షన్ ఎండి అంకూస్,మాజీ ఎంపిటిసి తోట కుమారస్వామి,తోట బిక్షపతి,తోట సదయ్య,స్వామి,రాముడు,ఐలయ్య,పసునూటి దేవేందర్,స్వామి,పిట్టల స్వామి,ఐలయ్య,నారాయణస్వామి తదితరులు పాల్గొన్నారు.