Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లిహన్మకొండ జిల్లా

పెద్దాపూర్ లో పాఠశాలను తనిఖీ చేసిన కలెక్టర్

(జై భారత్ వాయిస్ న్యూస్ ఆత్మకూరు)ఆత్మకూర్ మండలం పెద్దాపూర్ గ్రామం లోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలికల పాఠశాలలో హన్మకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ ఆకస్మిక తనిఖీ చేశారు.తనిఖీలో భాగంగా వైస్ ప్రిన్సిపాల్ చంద్రకళ ను పాఠశాలకు సంబంధించిన పలు విషయాలు అనగా విద్యార్థుల సంఖ్య, విద్య, ఆరోగ్యం, పరిశుభ్రత మొదలగు విషయాలు అడిగి తెలుసుకున్నారు మరియు వార్డెన్ కవితా రాణి ని రైస్ రూమ్, వంట సరుకులు గదిని పరిశీలించి పలు విషయాలు అడిగారు.వంటగది, భోజన శాల మొదలగు వాటిని పరిశీలించారు. తదుపరి క్లాస్ రూమ్ లకు వెళ్ళి విద్యార్థులతో ముచ్చటించారు. ముఖ్యంగా ఐదవ తరగతి విద్యార్థులతో మాట్లాడారు. కంప్లైంట్ బాక్స్ ను పరిశీలించారు. ఈ తనిఖీలో భాగంగా హన్మకొండ DCO వెంకట ప్రసాద్, MPDO శ్రీనివాస్ రెడ్డి మరియు RCO రాజ్ కుమార్ లు పాల్గొన్నారు.

Related posts

నేటి నుండి ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలు

మేడారం జాతరకు వెళ్ళే జాతీయ రహదారిపై వాహనాలు నిలుపవద్దు ఎస్సై కొంక అశోక్

Jaibharath News

ఇంటెన్సిఫైడ్ మిషన్ ఇంద్రధనస్సు    (Non Communicable diseases) పై అవగాహన