Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అవయవ దానంతో ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చు

Jaibharathvoice news Hanamkonda): హన్మకొండలోని వాగ్దేవి డిగ్రీ, పీజీ కళాశాలలో(virat foundation)విరాట్ ఫౌండేషన్ ,వ్యవస్థాపకుడు యశ్ వీరగోని ఆధ్వర్యంలో  Organ donationఅవయవ దానం పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా యశ్  విద్యార్థులకు అవయవ దానం ప్రాధాన్యత, దాని ద్వారా ఎన్నో ప్రాణాలు కాపాడవచ్చని వివరించారు. విద్యార్థులతో కలిసి అవయవ దానం ప్రతిజ్ఞ చేయించారు. ఆయన ప్రేరణతో సుమారు 500 మంది విద్యార్థులు అవయవ దానానికి నమోదు చేసుకున్నారు. విద్యార్థులు మాట్లాడుతూ తమ ద్వారా కూడా అవయవ దానంపై అవగాహన పెంచేందుకు కృషి చేస్తామని తెలిపారు.  ఈ సందర్భంగా  యశ్ వీరగొని  మాట్లాడుతూ, “ఇలాంటి సామాజిక సేవా కార్యక్రమాలు సమాజంలో మార్పు తీసుకువస్తాయని, ప్రతి ఒక్కరూ అవయవ దానంలో భాగం కావాలి” అన్నారు.ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో సహకరించిన రజిన్ కుమార్ కి, వాగ్దేవి కాలేజ్ మేనేజ్మెంట్‌కి వాలంటీర్లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Related posts

పెంచికలపెట లో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

Jaibharath News

శంకేశి రాజేష్ కు ఉత్తమ ప్రతిభా అవార్డు  

ఆత్మకూరు పంచాయతీ అధికారికి ప్రశంసా పత్రం

Jaibharath News