జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ
తెలంగాణ ప్రభుత్వం మహిళలు, పిల్లలు, దివ్యాంగులు మరియు వయోవృద్దుల సంక్షేమ శాఖ హనుమకొండ జిల్లా పరిధిలోని శిశు గృహలో ఒప్పంద ప్రాతిపదికన నర్స్,చౌకిదార్ ఉద్యోగాల నియామకానికి సంబందించి 23 వ తేదీన ఇచ్చిన పత్రిక ప్రకటనను సవరిస్తూ అర్హులైన మహిళా అభ్యర్థుల నుండి ధరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా సంక్షేమ అధికారి జె జయంతి తెలియచేశారు. అర్హత, అనుభవం, వయసు, తదితర పూర్తి వివరాలకు హనుమకొండ సుబేదారిలోని సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (కలెక్టరేట్), జీ1, జీ2 బ్లాక్ లో ఉన్న జిల్లా సంక్షేమ అధికారి కార్యాలయంలో సంప్రదించాలని ఈ నెల 31న సాయంత్రం 5. గంటల లోపు పూర్తి చేసిన దరఖాస్తులను G1, IDOC కలెక్టర్ కార్యాలయము నందు సమర్పించాలని సూచించారు హనుమకొండ జిల్లా అభ్యర్థులకు ప్రాదాన్యత ఇస్తూ నర్సు ఉద్యోగానికి 11,916/- లు,చౌకిదార్ కు 7,944/- ల వేతనంతో అర్హులైన మహిళా అభ్యర్థులను మౌఖిక పరీక్ష ద్వారా ఎంపిక చేస్తామని తెలిపారు. ఈ ఉద్యోగ ప్రకటనను ఎలాంటి కారణాలు తెలుపకుండా రద్దు చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్, హనుమకొండ గారికి కలదని జిల్లా సంక్షేమ అధికారి జె. జయంతి పేర్కొన్నారు.

