జై భారత్ వాయిస్ న్యూస్ గీసుగొండ, అక్టోబర్ 30: మొంథా తుఫాన్ ప్రభావంతో గీసుగొండ మండలంలోని పలు గ్రామాల్లో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు తీవ్రంగా దెబ్బతిని చాలామంది రైతులు భారీగా నష్టపోయారని బీజేపీ గీసుగొండ మండల అధ్యక్షులు కొంగర రవికుమార్ తెలిపారు.మండలంలోని పలు గ్రామాల్లో పర్యటించి పంటల దుస్థితిని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఏడాది పొడవునా శ్రమించి పండించిన పంటలు ఒక్క రాత్రిలో నేలమట్టం కావడం తీవ్ర ఆందోళన కలిగిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పంట నష్టాన్ని అంచనా వేయించి ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, ఎరువుల కొరతలతో ఇబ్బందులు ఎదుర్కొన్నా అప్పులు తెచ్చి పంటలు పండించిన రైతులను కనీసం ఇప్పుడైనా ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరారు. “ముఖ్యమంత్రి రాజకీయ ప్రదర్శనల్లో కాకుండా రాష్ట్ర ప్రజల కోసం పనిచేయాలిని కోరారు . ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా కార్యవర్గ సభ్యులు అల్లం కేదారి,రైతులు గాలి అనిల్,గాలి విజయ్, సారిబాబు, కొంగర జంపయ్య,అల్లం సాయిలు,అల్లం రవి,అల్లం అశోక్, గ్రామస్థులు పాల్గొన్నారు.



