జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ)
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకొని ఐక్యత దినోత్సవం సందర్భంగా గుజరాత్ లోని కెవాడియా ఏక్తానగర్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ ప్రాంగణంలో శుక్రవారం జరిగిన రాష్ట్రీయ ఐక్యత దినోత్సవం వేడుకల్లో భాగంగా ఓరుగల్లు విద్యార్థులు చేసిన కూచిపూడి నృత్య ప్రదర్శన పలువురిని ఆకట్టుకుంది. శివానంద నృత్య మాల నాట్య గురువు భోంపల్లి సుధీర్ రావు ఆధ్వర్యంలో శిక్షణ తీసుకున్న విద్యార్థులు తమ నృత్య ప్రదర్శనతో జాతీయస్థాయిలో ఓరుగల్లు ఖ్యాతిని చాటారని నాట్య గురువు సుదీర్ రావు చెప్పారు. నృత్య ప్రదర్శనను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తిలకించినట్లు పలువురు ప్రముఖులను తమ విద్యార్థుల నృత్య ప్రదర్శనతో ఆకట్టుకున్నారని చెప్పారు ఈ ప్రదర్శనలో కమలాక్షిత, త్రిపాద, మనస్విని, సాత్విక, రుతిక, హరిప్రియ రెడ్డి, వైష్ణవి ,శృతి సామాన్వి, వినయారెడ్డి పాల్గొన్నరని తెలిపారు.




