జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
గీసుకొండ మండలకేంద్రంలో అనారోగ్యంతో ఇటివల మరణించిన సీనియర్ సిటిజన్ సారంపెల్లి గోపాల్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి గీసుకొండ గ్రామానికి చెందిన పెగళ్లపాటి లక్ష్మీనారాయణ మానవత్వంతో స్పందించి ఐదు వేల రూపాయలఆర్థిక సహాయాన్ని పంపగా, అట్టి నగదును గీసుకొండ సోషల్ సర్వీస్ టీం కన్వీనర్ కర్ణకంటి రాంమూర్తి మృతుని కుమారులకు అందజేయడం జరిగింది. ఈకార్యక్రమంలో స్థానిక పెద్దలు వటుకుల చంద్రారెడ్డి , సారంపెల్లి రాజిరెడ్డి , సారంపెల్లి నరేందర్ రెడ్డి వటుకుల గోపిరెడ్డి పాల్గొన్నారు.

