(జై భారత్ వాయిస్ న్యూస్ హన్హనుమకొండ) హన్మకొండ లో: ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ముంపునకు గురైన కాలనీల్లో జరిగిన నష్టం పై ప్రాథమిక అంచనా కోసం చేపట్టిన సర్వేను త్వరగా పూర్తి చేయాలని హనుమకొండ జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్ సర్వే బృందాలను ఆదేశించారు.ఆదివారం జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నగరంలోని ముంపునకు గురైన పలు కాలనీల్లో జరిగిన ఇండ్లు, ఇంట్లోని సామగ్రి, వాహనాలు, తదితరాలకు నష్టం వాటిల్లగా ప్రభుత్వం నుండి పరిహారం అందించేందుకు ప్రాథమిక అంచనాకు సర్వే బృందాలు ముంపు కాలనీల్లో ఇంటింటా సర్వే నిర్వహిస్తున్నాయి. సర్వే బృందాలు ఉదయం 8 గంటల నుండి వరద ముంపునకు గురైన కాలనీల్లో ఇంటింటికి చేరుకుని ఆన్లైన్ యాప్ లో వివరాలు నమోదు చేస్తున్నారు. వరద ముంపునకు లోనైన సమ్మయ్య నగర్, అమరావతి నగర్, వివేక్ నగర్, టీవీ టవర్ కాలనీ, గుండ్ల సింగారం ఇందిరమ్మ కాలనీ, రాయపుర, ఇతర కాలనీలలో ఆన్లైన్ యాప్ ద్వారా 146 మంది సిబ్బంది 61 కాలనీల్లో జరిగిన నష్టం పై బాధిత కుటుంబాల నుండి వివరాలు నమోదు చేస్తున్నారు. జరిగిన ఆస్తి , వస్తువులు, వాహనాల వివరాలతో కూడిన ఫోటోలను ఆన్లైన్లో నమోదు చేస్తున్నారు. ముంపు కాలనీల్లో జరిగిన నష్టం వివరాల నివేదిక ఆధారంగా బాధిత కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా పరిహారం అందనుంది. సర్వే బృందాలను వీలైనంత త్వరగా వరద ముంపు ప్రభావిత కాలనీల్లో జరిగిన నష్టం పై సర్వేను పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. సర్వే ప్రగతిని కలెక్టర్ ఎప్పటికప్పుడు అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు. కాలనీల్లో అధికారుల సమక్షంలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న సర్వేను కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు. హనుమకొండలోని రాయపురా, ఇతర కాలనీలో సర్వే బృందాలు నమోదు చేస్తున్న వివరాలను ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రోహిత్ పరిశీలించారు. అదేవిధంగా హనుమకొండ, కాజీపేట, హసన్ పర్తి తహసీల్దార్లు రవీందర్ రెడ్డి, భావ్ సింగ్, చల్లా ప్రసాద్, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కాజీపేట డివిజన్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ సర్వే బృందాలను మార్గనిర్దేశం చేస్తున్నారు.కొనసాగుతున్న సహాయక చర్యలుతీవ్ర వరద ముంపునకు గురైన కాలనీల్లో వివిధ శాఖల ఆధ్వర్యంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వివేక్ నగర్, అమరావతి నగర్, సమ్మయ్య నగర్, టీవీ టవర్ కాలనీ, జవహర్ కాలనీ, న్యూ శాయంపేట రోడ్డు, తదితర కాలనీల్లో వరద ఉధృతికి కొట్టుకు వచ్చిన బురద, చెత్తాచెదారాన్ని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ పారిశుద్ధ్య సిబ్బంది తొలగిస్తున్నారు. ఇండ్లతోపాటు ప్రభుత్వ పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల నుండి బురద మట్టిని, చెత్తా చెదారాన్ని తీసేస్తున్నారు. నీట మునిగిన కాలనీల్లో బురద మట్టి, చెత్తా చెదారాన్ని తొలగించిన తర్వాత బ్లీచింగ్ పౌడర్ ను వేస్తున్నారు. అదేవిధంగా నీరు నిలిచిన చోట దోమల లార్వా పెరగకుండా ద్రావణాన్ని స్ప్రే చేస్తున్నారు. పారిశుద్ధ్య నిర్వహణ పనులు ముమ్మరంగా సాగుతుండగా సీఎంహెచ్వో డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ రవీందర్, తహసిల్దార్లు పారిశుద్ధ్య పనులను పర్యవేక్షిస్తున్నారు.
previous post

