జై భారత్ వాయిస్ న్యూస్ మైలవరం : వైసిపి నాయకులు తప్పులు చేయటం, దోచుకోవటం, దాచుకోవటం బాగాఅలవాటు డైవర్షన్ పాలిటిక్స్ కి పెట్టింది పేరు వైసిపితప్పులు చేయటమనేది వాళ్ల డి.ఎన్.ఎలోనే వుంది. అందుకే నకిలి మద్యంలో కేసులో సంబంధం వున్న జోగి రమేష్ అమ్మవారి ముందు దొంగ ప్రమాణం చేశాడుఅందుకే పాపం పండి అరెస్టు కావటం జరిగిందని ఏపీ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ కార్పొరేషన్ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ ఆరోపించారు.నకిలీ మధ్యం కేసులో జోగి రమేష్ అరెస్ట్ పై ఆంధ్రప్రదేశ్ లైవ్ స్టాక్ డెవలప్మెంట్ ఏజెన్సీ డైరెక్టర్ దొండపాటి విజయ్ కుమార్ మీడియాకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయిన జనార్ధన్ రావు ఇచ్చిన స్టెట్ మెంట్ ఆధారంగానే జోగి రమేష్ ను సిట్ అధికారులు, పోలీసులు అరెస్ట్ చేయటం జరిగిందని తెలిపారు.ఈ అరెస్ట్ కు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలాంటి సంబంధం లేదన్నారు. తన అరెస్ట్ గురించి ముందే గ్రహించిన జోగి రమేష్ తన స్థాయి పెంచుకోవటానికి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ నిందలు మోపడం జరిగిందన్నారు. జోగి రమేష్ ఒక బచ్చా అంటూ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకురావాలనే సంకల్పంతో కృషి చేస్తున్న సీఎం చంద్రబాబుకు, మంత్రి నారా లోకేష్ కు జోగి రమేష్ గురించి ఆలోచించేంత తీరక లేదన్నారు. జనార్థన్ రావు నకిలీ మద్యంలో కేసు లో జోగి రమేష్ కి సంబంధం వుందని వాంగ్మూలం ఇచ్చిన తర్వాతే జోగి రమేష్ పై సిట్ , పోలీసులు అధికారులు దృష్టి పెట్టడం జరిగిందన్నారు. ఇప్పుడు అరెస్ట్ అయిన జోగి రమేష్ విచారణలో నకిలీ మద్యం వెనక వున్న అసలు కీలక సూత్రధారి వై.ఎస్.జగన్ పేరు చెప్పటం ఖాయమన్నారు.దొంగతనం చేసి ప్రతి దొంగ ముందు తాను నిర్ధోషినే అంటాడు…పోలీసుల విచారణలో అన్ని నిజాలు బయటకు వస్తాయని, అలాగే జనార్ధన్ రావు పోలీసులు విచారణలో జోగి రమేష్ పేరు బయటికి వచ్చిందన్నారు.తప్పు చేసిన దొరికిపోయిన జోగి రమేష్ తన అరెస్ట్ సమయంలో కులం గుర్తు రావటం సిగ్గు చేటు అన్నారు. బిసి అని చెప్పుకుంటున్న జోగి రమేష్ తనకు వున్న వందల కోట్లు రూపాయలు బిసిలకు పంచిపెట్టాలన్నారు. తన అరెస్ట్ ను డైవర్షన్ చేయటానికి జోగి రమేష్ రకరకాలు ప్రయత్నాలు చేశాడన్నారు. ఈ రాష్ట్రంలో బిసిలకు అధికారం హక్కును తెలుగు దేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు కల్పిస్తే..ఆ తర్వాత సీఎం చంద్రబాబు నాయుడు కొనసాగించారన్నారు. వాళ్ల వల్లే వై.ఎస్ జగన్ బిసిలకు వైసిపిలో అరకొర పదవులు ఇచ్చాడు. రాష్ట్రంలో బిసిలకు వెలుగు నిచ్చింది తెలుగుదేశం పార్టీ అంటూ ఉద్ధాఘాటించారు. తను బిసి కాబట్టే అరెస్ట్ చేస్తున్నారని జోగి రమేష్ మాట్లాడితే నమ్మటానికి ప్రజలెవ్వరూ సిద్దంగా లేరన్నారు. బిసి కార్డ్ మీద లబ్ది పొందిన జోగి రమేష్ ఒక బిసికి సాయం చేసిన దాఖలాలు లేవన్నారు. జగన్ మోహన్ రెడ్డి పాలనలో ఎంతో మంది బిసిల ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఆ సమయంలో జోగి రమేష్ కు బిసి లు ఎందుకు గుర్తు రాలేదంటూ ప్రశ్నించారు. పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో కులం గుర్తు రావటం చాలా దురదృష్టకరమన్నారువై.ఎస్ .జగన్ తన హయంలో నకిలీ మద్యం తయారు చేయించి అమ్మటం ఒక అలవాటుగా మారింది. అందుకే డిజటల్ పేమెంట్స్ వైన్స్ షాపుల దగ్గర తీసివేశారు. ఈ మద్యం కుంభకోణం కేసులో కూడా తాడేపల్లి ప్యాలెస్ కు డబ్బు చేరినట్లు చెప్పారు. నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ వెనుక జగన్ ఉన్నాడన్నారు. అందుకే ఈ వ్యవహారం గత ప్రభుత్వం లో బయటకు పొక్కలేదన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాతే ఈ నకిలీ మద్యం వెలుగులోకి తీసుకురావటం జరిగిందన్నారు. టిడిపి తరుఫున జయచంద్రారెడ్డి పోటీ చేసిన సరే అరెస్ట్ చేయటం జరిగిందని, తక్షణం సీఎం చంద్రబాబు పార్టీ నుంచి సస్పెండ్ చేయటం జరిగిందన్నారు. వైసిపి నాయకులు ఒక పథకం ప్రకారమే జయచంద్రారెడ్డి ను టిడిపిలో పంపించటం జరిగిందన్నారు. నకిలీ మద్యం కేసుకి సంబంధించి సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ వచ్చి ప్రమాణాలు చేయాలని జోగి రమేష్ అడగటం తను తప్పు చేయలేదని అమ్మవారి గుడిలో ప్రమాణం చేయటంతో పాపం పండిందన్నారు. ఈ కేసు కి వాళ్లకి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. జగన్ మోహన్ రెడ్డి బాబాయ్ వివేకా నందరెడ్డిని హత్య చేయించాడు…42 వేల కోట్లు దోచుకున్నాడు..హత్య చేయించలేదని, డబ్బులు దోచుకోలేదని ప్రమాణం చేస్తే తప్పు చేయనట్లేనా అంటూ ప్రశ్నించారు.వైసిపిలో జగన్ పెద్ద దొంగ అయితే జోగి రమేష్ లాంటి నాయకులు చిన్న దొంగలు అంటూ చురకలు అంటించారు. దమ్ముంటే అరెస్ట్ చేయాలన్న జోగి రమేష్ పోలీసులు వచ్చే సరికి పిల్లిలాగా బాత్ రూమ్ లోకి పారిపోయి దాగున్నాడని ఎద్దేవా చేశారు. తప్పు చేశాఢు కాబట్టే పోలీసుల ఎదుట నిలబడి సమాధానం చెప్పలేకపోతున్నాడన్నారు.వైసిపి పాలనలో తనతో పాటు టిడిపి నాయకుల్ని అరెస్ట్ చేయటానికి ఎన్నో సార్లు పోలీసులు వచ్చారు. తాము తప్పు చేయలేదు కాబట్టి పోలీసులను చూసి పారిపోలేదని, ధైర్యంగా నిలబడి పోరాడమన్నారు. జోగి రమేష్ కు నిజాయితీ లేదు కాబట్టే పోలీసుల్ని చూసి పారిపోవటానికి ప్రయత్నించాడన్నారు. ఏ ప్రభుత్వంలోనైనా ఎమ్మెల్యేలు అవినీతి చేస్తే జైలు వెళ్లాల్సిందేనన్నారు. రాష్ట్రాన్ని వైసిపి నాయకులు నాశనం చేశారు. ఇందులో ప్రధాన పాత్ర జగన్ మోహన్ రెడ్డి పోషిస్తే ఆ తర్వాత పాత్ర జోగి రమేష్ పోషించాడన్నారు.వైసిపి నాయకులు నకిలీ మద్యం సరాఫరా చేసి రాష్ట్రంలోని ప్రజలకు స్లో పాయిజన్ ఇచ్చారని మండిపడ్డారు. ప్రజల ప్రాణాలు తీసి డబ్బులు దోచుకోవటం జరిగిందన్నారు. ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామన్నారు. వైసిపి నాయకులు ఇంకా ఓవర్ యాక్షన్ చేస్తే నకిలీ మద్యం తాగి చనిపోయిన వారి కుటుంబ సభ్యులతో తాడేపల్లి ప్యాలెస్ ఎదుట ధర్నా చేస్తామని హెచ్చరించారు. జోగి రమేష్ మంచోడని మరో దొంగ జగన్ సర్టిఫికేట్ ఇవ్వడం విశేషమన్నారు. జనార్ధన్ అంత స్పష్టంగా చెప్పినా జగన్ చిలక పలుకులు పలకటం ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. మద్యం షాపుల్లో ఆన్ లైన్ లావాదేవీలు లేకుండా చేసి జగన్ కోట్ల రూపాయాలు దోచుకున్నాడన్నారు. వైసిపి నాయకులు వై.ఎస్ జగన్ ఎన్ని డ్రామాలు ఆడినా, కల్తీ మద్యం కేసులో పాత్రధారులు, సూత్రధారులు అందరూ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు.

