జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ
వరంగల్ జిల్లా లోఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా గీసుగొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్క్ లో వరద నీరు చేరిన పరిస్థితిని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం పరిశీలించారు.
కలెక్టర్ టెక్స్టైల్ పార్క్ వద్ద గల నాలను, రాళ్ళమాటు చెరువు మత్తడిని కలెక్టర్ పరిశీలించారు.టెక్స్ టైల్ పార్క్ పరిసరాలను కలెక్టర్ పరిశీలించి వర్షపు నీరు పార్క్ ప్రాంతంలోకి ఎలా ప్రవేశించిందని, దానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. రాళ్ల మాటు చెరువు, పార్కు కు పై భాగంలో ఉన్న బొల్లికుంట,సంగెo గ్రామాల నుండి వరద నీరు ప్రవహించి టెక్స్టైల్ పార్క్ లో చేరుకున్నదని అధికారులు వివరించారు.వస్త్రపరిశ్రమల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా నాలా రిటేనింగ్ వాల్ నిర్మాణ పనులు చేపట్టాలని అధికారుల సూచించారు.భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు మరలా తలెత్తకుండా తగిన శాశ్వత చర్యలు తీసుకోవాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.అనంతరం సంగెo మండలానికి వెళ్లే రహదారిలో గల కల్వర్టును కలెక్టర్ పరిశీలించి కల్వర్టును బలోపేతం చేయుటకు మరమ్మతులు చేయాలని అధికారులకు సూచించారు.కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఈఈ సునీత, ఆర్ అండ్ డిఈ, డీఈ వేణు, తాహశీల్దారులు రియాజుద్దీన్, రాజ్ కుమార్ తదితరులు ఉన్నారు.


