జై భారత్ వాయిస్ న్యూస్ సంగెం
సంగెం మండలంలోని గవిచర్ల బాలికల రెసిడెన్షియల్ మోడల్ స్కూల్ ను వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద ఆదివారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కిచెన్, డైనింగ్ హాల్, స్టోర్ రూం లను పరిశీలించి సదుపాయాలను గమనించారు.బియ్యం నిల్వలు, కూరగాయల నాణ్యత, సరుకుల స్టాక్ ను పరిశీలించారు. తాజా కూరగాయలు వినియోగించాలని, ఈగలు, దోమల బెడద లేకుండా పాఠశాల సముదాయాన్ని, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, పరిసరాల్లో గల ముళ్ల పొదలను తొలగించాలని, ఆహార పదార్థాలు కలుషితం కాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. మెనూ పట్టికను పరిశీలించి, విద్యార్థినులకు మెనూ ప్రకారం పౌష్టికాహారం అందించాలని సూచించారు. ఏమైనా సమస్యలు ఉంటే ఏర్పాటుచేసిన ఫిర్యాదుల పెట్టెలో వేయాలని కలెక్టర్ విద్యార్థులను కోరారు.ఈ సందర్భంగా రెసిడెన్షియల్ పాఠశాలలో కావలసిన సదుపాయాల గురించి విద్యార్థులు కలెక్టర్ దృష్టికు తీసుకోరగా వెంటనే తగు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.కలెక్టర్ వెంట డిబిసిడిఓ పుష్పలత, తహసీల్దార్ రాజ్ కుమార్, వార్డెన్, తదితరులు ఉన్నారు..


